మేం తగ్గలేదు.. ‘‘అఖండ’’తో డెర్ స్టెప్ వేశాం, మల్టీస్టారర్‌కు రెడీ : బెజవాడలో బాలయ్య వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘అఖండ’’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా థియేటర్‌లలో కాసుల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. అమెరికాలోనూ వన్ మిలియన్ వసూళ్లు సాధించి బాలయ్య తన పేరిట మరో రికార్డు రాసుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు టూర్లు ప్లాన్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలను యూనిట్ చుట్టేస్తోంది. తాజాగా ఈ రోజు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిలు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. అఖండ’ మూవీ ఘనవిజయం సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని చూపించిన సినిమా ‘అఖండ’ అని.. అమ్మవారి ఆశీస్సులతో ప్రేక్షకులు విజయాన్ని అందించారని బాలయ్య వెల్లడించారు. ‘అఖండ’ విడుదలై ఘన విజయం సాధించాక నిర్మాతలకు ధైర్యం వచ్చిందన్న ఆయన అన్నారు. అందరూ సినిమాలు విడుదల చేసేందుకు..ముందుకొస్తు న్నారని బాలయ్య వివరించారు. దర్శకులు ముందుకొచ్చి మంచి కథ తెస్తే.. మల్టీస్టారర్ చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశామని, కొంతమంది ఆగినా.. మేమెక్కడా వెనుకడుగు వేయలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.
ఏపీలో టికెట్ రేట్లపై, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టికెటింగ్ విధానంపై హీరో బాలకృష్ణ స్పందించారు. టికెట్ రేట్లపై ప్రభుత్వం సుప్రీంకు వెళ్తే.. నిర్మాతలు కూడా వెళ్తారని చెప్పారు. తాము అన్నింటికీ సిద్ధమయ్యే సినిమా విడుదల చేశామని.. టికెట్ ధరలపై హైకోర్టు తీర్పు రాకున్నా ధైర్యంతో అఖండ రిలీజ్ చేసినట్లు బాలయ్య తెలిపారు. న్యాయ నిర్ణీత దేవుడేనని... చిత్ర పరిశ్రమను తప్పకుండా కాపాడతామని ఆయన స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com