ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన

  • IndiaGlitz, [Friday,February 04 2022]

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిపై హిందూపురం వాసులు భగ్గుమన్నారు. పార్లమెంట్ కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా వున్న హిందూపురాన్ని కాదని పుట్టపర్తిని ఎలా జిల్లా చేస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనం ఆందోళనలకు హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మద్ధతు తెలిపారు.

శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం హిందూపురం వచ్చిన బాలకృష్ణ ..శుక్రవారం తన ఇంటి నుంచి బయలుదేరి స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. బాలయ్య మౌన దీక్షను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దమని సంచలన ప్రకటన చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్దమా అని బాలయ్య సవాల్ విసిరారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎక్కడా కన్పించడం లేదంటూ దుయ్యబట్టారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి జీవోలు జారీ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.

More News

'అంటే సుందరానికి'... ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నాని

కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్నీ ఒకదాని వెంట ఒకటి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి మే వరకు భారీ , మధ్యతరహా, చిన్న సినిమాల విడుదలతో బాక్సాఫీస్ కళకళలాడనుంది.

బండ్ల గణేష్ కూతురు చేతుల మీదుగా విడుదలైన 'డేగల బాబ్జీ' లోని "కలలే కన్నానే.." లిరికల్ వీడియో

ఒక వ్యక్తి, ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా. అయితే,

కాజల్‌కు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ

సినీ నటి కాజల్‌కు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత అరుదుగా, కొందరు ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను యూఏఈ ప్రభుత్వం కాజల్ అగర్వాల్‌కు అందజేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ..

బ్రేకింగ్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు

యూపీ ఎన్నికల ప్రచారంలో వున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది.

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్.. ఫోటోను తడుముతూ బన్నీ భావోద్వేగం

కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం నుంచి ఇంకా చిత్ర పరిశ్రమ, అభిమానులు, సన్నిహితులు కోలుకోలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట ఆయన ప్రస్తావన వస్తూనే వుంది.