ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : నందమూరి బాలకృష్ణ సంచలన ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దీనిపై హిందూపురం వాసులు భగ్గుమన్నారు. పార్లమెంట్ కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా వున్న హిందూపురాన్ని కాదని పుట్టపర్తిని ఎలా జిల్లా చేస్తారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనం ఆందోళనలకు హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మద్ధతు తెలిపారు.
శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మౌన దీక్ష ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం హిందూపురం వచ్చిన బాలకృష్ణ ..శుక్రవారం తన ఇంటి నుంచి బయలుదేరి స్థానిక పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకున్నారు. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అఖిలపక్ష నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి.. బాలయ్య మౌన దీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దమని సంచలన ప్రకటన చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామాకు సిద్దమా అని బాలయ్య సవాల్ విసిరారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఎక్కడా కన్పించడం లేదంటూ దుయ్యబట్టారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి జీవోలు జారీ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout