శ్రీమంతుడు బాటలో నందకృష్ణుడు
Send us your feedback to audioarticles@vaarta.com
మహేశ్ అంటే పేరు కాదు అదో బ్రాండ్ అయిపోయింది... నేటితరం టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న మహేశ్ ను ప్రేక్షకులే కాదు యంగ్ హీరోలు కూడా ఫాలోఅవుతున్నారు... ఇదే తరహాలో హాపెనింగ్ హీరో నందు కూడా మహేశ్ అడుగుజాడల్లో నడిచే ఆలోచనలో ఉన్నాడు... ఇంతకి విషయమేటంటే 100%లవ్, ఆటోనగర్ సూర్య, 365 డేస్ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నందు త్వరలో ఓ హార్ట్ టచింగ్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు... అయితే ఇప్పటివరకు విభిన్న పాత్రలు పోషించిన నందు ఇక పై లవ్ అండ్ టచ్ ఉన్న స్టోరీల్ని సైతం ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు...
మహేశ్ కూడా ఖలేజా వరుకు పవర్ ఫుల్ పాత్రల్లోనే నటించి ఆ తరువాత దూకుడు నుంచి కామెడీ ఫ్లేవర్ వైపు టర్న్ ఐ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇదే ఫార్మూలాను ఇప్పుడు నందు కూడా తన కెరీర్ అప్లై చేయాలని డిసైడయ్యాడు. ఇక నందు నుంచి రాబోతున్న ఆ రొమాంటిక్ కామెడీ మూవీతో బిక్స్ ఇరుసడ్ల అనే యంగ్ డైరెక్టర్ పరిచయమవుతున్నాడు... భాస్కర భాసాని నిర్మాతగా ఏ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందనుంది... అధికారికంగా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించబోతున్నారు. మరి నూతన దర్శకుడు బిక్స్ తో కలిసి నందు చేయబోతున్న ఈ న్యూ ట్రిక్స్ ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తాయో చూడాలి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments