తలైవా సినిమాలో నానా పటేకర్...

  • IndiaGlitz, [Monday,May 29 2017]

బాలీవుడ్‌లోనానా ప‌టేక‌ర్‌కు విల‌క్ష‌ణ న‌టుడుగా చాలా మంచి పేరుంది. పాత్ర న‌చ్చితే కానీ సినిమాలో ఆయ‌న న‌టించడు. అటువంటిది ఇప్పుడు నానా ప‌టేక‌ర్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలో న‌టిస్తున్నాడు. సాధార‌ణంగా కంటెంట్ ప్ర‌ధానంగా సినిమాల‌ను రూపొందించే ద‌ర్శ‌కుడు పా రంజిత్ క‌బాలి త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌తో వెంట‌నే చేస్త‌న్న సినిమా 'కాలా'. ప్ర‌స్తుతం సినిమా ముంబైలో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అల్రెడి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.
ఇప్పుడు నానా ప‌టేక‌ర్ ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతాడ‌నేది అంద‌రిలో ఆస‌క్తిని రేకెతిస్తుంది. హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అంజ‌లి పాటిల్, సుముద్ర ఖని కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు. ఇప్పుడు నానా ప‌టేక‌ర్ న‌టిస్తుండ‌టంతో సినిమాపై ఇంకా అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమా నెక్స్‌ట్ షెడ్యూల్ చెన్నైలో చిత్రీక‌రిస్తున్నారు. హీరో ధ‌నుష్ త‌న స్వంత నిర్మాణ సంస్థ వండ‌ర్ బార్స్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మిస్తున్నాడు.