రియల్ ‘హీరో’ మీరే సారూ.. 500 ఇళ్లు కట్టిస్తున్న ‘నానా’!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈయనకుండే సేవాగుణం అలాంటిది మరి. ఇప్పటికే రైతులు, సైనికులకు ఉదారతతో విరాళాలిచ్చి పెద్ద మనసును చాటుకున్నారు. ఒక్క మాటలో మాటల్లో చేతల్లో అని చేసి చూపి.. రియల్ హీరో అనిపించుకున్నాడు నానా పటేకర్. ఎవరు ఆపదలో ఉన్నా తనవంతు సాయం అందించేందుకు నానా ముందు వరుసలో ఉంటారు. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లక్షలాది ఇళ్లు నీటమునిగాయి.. అంతేకాదు.. వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వీటన్నింటినీ చూసి చలించిపోయిన నానా పటేకర్ వరద బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించారు.
చలించి.. 500 ఇళ్ల నిర్మాణంకు...
వరద బాధితులకు 500 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నానా నిర్ణయించి.. వీలైనంత త్వరలో దీన్ని అమల్లోకి తేవాలని యోచిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తన పెద్ద మనసును పది మందితో చెప్పుకున్నారు. తాను షిరోల్కు వచ్చినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూసి చలింపోయాను.. అందుకే ఇక ఆలస్యం చేయకుండా 500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నానని నానా పటేకర్ తెలిపారు. అంతేకాకుండా తక్లేవాడీ ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను కూడా తాము పరిశీలిస్తామని.. మరమత్తులు చేయిస్తామని కూడా అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అంతటితో ఆగని ఆయన.. ప్రభుత్వం అందరినీ ఆదుకోవడం సాధ్యం కాదనీ, ఈ విషయంలో ప్రజలకు కూడా ముందుకు రావాలని నాని పటేకర్ పిలుపునిచ్చారు.
కాగా.. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో చేపట్టిన నానా.. తాజాగా ఇలా మరోసారి తన పెద్ద మనసు చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నారు నానా పటేకర్. ఇదిలా ఉంటే బాలీవుడ్ బోలెడంత మంది నటీనటులు ఉన్నారు గనుక.. తలా ఓ చేయేస్తే వరద బాధితులు సేఫ్ అవుతారు. సో.. ఈయన పిలుపుతో ఎంత మంది స్వచ్ఛందంగా సేవలు చేయడానికి వస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments