నిర్మాతను హర్ట్ చేసిన నమ్రత శిరోద్కర్
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ హీరోయిన్, మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఓ నిర్మాతను హార్ట్ చేసిందా? కావాలనే అలా జరిగిపోయిందో తెలియదు కానీ..నమ్రత మాత్రం ఓ సీనియర్ నిర్మాతలను హర్ట్ చేసిందనే సంగతి పక్కాగా అర్థమవుతుంది. అసలేం జరిగింది. నమ్రత ఇంతకీ ఏ నిర్మాతను హర్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నాటికి మహేశ్‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన మూవీ ఒక్కడు విడుదలై 18 ఏళ్లు అవుతుంది. ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ, "మహేశ్ సినిమాల్లో ఒక్కడు ఓ క్లాసిక్. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. నాకు ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ" అంటూ ఆ సినిమాకు వర్క్ చేసిన ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్ చెబుతూ నమ్రతా మెసేజ్‌ను ట్వీట్ చేసింది. అయితే లిస్టులో అందరి పేర్లను ప్రస్తావించిన నమ్రతా శిరోద్కర్.. నిర్మాత ఎం.ఎస్.రాజు పేరును రాయలేదు.
ఈ విషయాన్ని గమనించిన నిర్మాత ఎం.ఎస్.రాజు .."తప్పుడు జరుగుతాయి బాబు..ఒక్కడు సినిమా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో నమ్రతగారు ఒక్కడు గురించి చెబుతూ నా పేరుని మరచిపోయారు. అయితే ఆ సినిమా ఆమెకు ఫేవరేట్ మూవీ అయినందుకు సంతోషంగా ఉంది. గుడ్ లక్" అంటూ ట్వీట్టర్లో మహేశ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, ఎం.ఎస్.రాజుకు సపోర్ట్‌గా మీరు లేకుండా ఒక్కడు సినిమా లేదు సార్. ఇంత గొప్ప సినిమాను మాకు ఇచ్చినందుకు థాంక్స్ అంటూ నిర్మాత ఎం.ఎస్.రాజుకు ధన్యవాదాలు చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com