మహేష్ ఫోటోపై నమ్రత కామెంట్..

  • IndiaGlitz, [Tuesday,November 17 2020]

కొందరి విషయంలో వయసు పెరుగుతుందో.. తగ్గుతుందో ఏమాత్రం అర్థం కాదు.. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. గ్లామర్ విషయంలో కూడా ఆయనతో పోటీ పడే హీరో ఇండస్ట్రీలోనే ఇప్పటికైతే లేరంటే అతిశయోక్తి కాదు. 45 ఏళ్ల వయసులో మంచి ఫిజిక్‌తో పాటు గ్లామర్‌ని కూడా మెయిన్‌టైన్ చేయడం మహేష్‌కి మాత్రమే సాధ్యమవుతుందేమో.. అందుకే మహేష్ ఏ పాత్రకైనా అద్దినట్టుగా సూట్ అయిపోతాడు. ‘మహర్షి’లో స్టూడెంట్‌గా కూడా బాగా సెట్ అయ్యాడు.

ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా మహేష్ ఫొటో ఒకదాన్ని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దుబాయ్ విమానాశ్రయంలో ఈ ఫోటోను తీసినట్టు ఆమె వెల్లడించారు. అయితే ఆ ఫోటో తెల్లవారుజామున 3 గంటలకు తీశారట. దీనిపై నమ్రత ఓ కామెంట్ కూడా చేశారు. ‘తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇలా కనిపించడం ఎవరికి సాధ్యం.. మీ ముందు ఒక అద్భుతమైన వ్యక్తి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ కూర్చొన్నప్పుడు సమయం ఎగిరిపోతుంది’ అంటూ ఫోటోను నమ్రత పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ కూలింగ్ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ఈ ఫోటో అభిమానుల మనసు దోచేస్తోంది.