నమితకు యువకుడి బెదిరింపులు.. స్ట్రాంగ్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మ నమిత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాల్లో ఓ మెరుపు మెరిసిన నమిత.. అంతేరీతిలో అడ్రస్ లేకుండా పోయింది. ఈ బొద్దు భామకు తమిళనాట ఏకంగా గుడి నిర్మించారంటే ఏ రేంజ్లో అభిమానిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెళ్లయిన తర్వాత ఈ భామ అసలే సినిమాల్లో నటించకుండా దూరమైంది. మరోవైపు బీజేపీ తీర్థం పుచ్చుకుని పేరుకు మాత్రమే అంతే.. క్రియాశీలకంగా పాల్గొన్న సందర్భాల్లేవ్. ప్రస్తుతం భర్తతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాల పరంగా ఎలాంటి విశేషాలు లేనప్పటికీ అభిమానులు, ఫాలోవర్స్, సినీ ప్రియులకు ఈ భామ సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటూ వస్తోంది. అయితే.. తాజాగా ఓ నెటిజన్ ఈ భామను బెదిరించి.. అసభ్యంగా మాట్లాడాడు.
అసలేం జరిగింది..!?
నమితతో చాట్ చేస్తూ.. హాయ్ ఐటమ్ అంటూ సరసానికి దిగాడు. దీంతో నన్నే అంత మాట అంటావా అంటూ తీవ్ర ఆగ్రహంతో నమిత ఊగిపోయింది. అంతేకాదు ఆమెను బెదిరించి ‘నీ అకౌంట్ హ్యాక్ అయింది’ అని నమ్మించాడు. అయితే నమిత మాత్రం ఆ మాటలను లెక్కలేయలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు ‘నీ అశ్లీల వీడియోలు నా దగ్గరున్నాయ్.. ఎక్కువ చేశావంటే వాటిని బయటపెడతా’ అని బెదిరించసాగాడు.
నీ ఇష్టం వచ్చింది చేస్కో!
ఆ యువకుడు ఇష్టానుసారం మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతండటంతో ఏ మాత్రం తగ్గని ముద్దుగుమ్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘నీ ఇష్టం వచ్చింది చేసుకోపో’ అంటూ లెక్క చేయకుండానే మాట్లాడేసింది. అనంతరం సదరు యువకుడితో చాటింగ్ విషయాన్ని.. ఆ యువకుడి ఫొటోతో సహా బయటపెట్టింది. ఇలాంటి వెధవలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అభిమానులతో షేర్ చేసుకుంది. మరి ఆ యువకుడి పరిస్థితి ఫైనల్‌గా ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments