నమితకు యువకుడి బెదిరింపులు.. స్ట్రాంగ్ వార్నింగ్

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

అందాల ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మ నమిత గురించి సినీ ప్రియులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాల్లో ఓ మెరుపు మెరిసిన నమిత.. అంతేరీతిలో అడ్రస్ లేకుండా పోయింది. ఈ బొద్దు భామకు తమిళనాట ఏకంగా గుడి నిర్మించారంటే ఏ రేంజ్‌లో అభిమానిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పెళ్లయిన తర్వాత ఈ భామ అసలే సినిమాల్లో నటించకుండా దూరమైంది. మరోవైపు బీజేపీ తీర్థం పుచ్చుకుని పేరుకు మాత్రమే అంతే.. క్రియాశీలకంగా పాల్గొన్న సందర్భాల్లేవ్. ప్రస్తుతం భర్తతో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. సినిమాల పరంగా ఎలాంటి విశేషాలు లేనప్పటికీ అభిమానులు, ఫాలోవర్స్, సినీ ప్రియులకు ఈ భామ సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటూ వస్తోంది. అయితే.. తాజాగా ఓ నెటిజన్ ఈ భామను బెదిరించి.. అసభ్యంగా మాట్లాడాడు.

అసలేం జరిగింది..!?

నమితతో చాట్ చేస్తూ.. హాయ్ ఐటమ్ అంటూ సరసానికి దిగాడు. దీంతో నన్నే అంత మాట అంటావా అంటూ తీవ్ర ఆగ్రహంతో నమిత ఊగిపోయింది. అంతేకాదు ఆమెను బెదిరించి ‘నీ అకౌంట్ హ్యాక్ అయింది’ అని నమ్మించాడు. అయితే నమిత మాత్రం ఆ మాటలను లెక్కలేయలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు ‘నీ అశ్లీల వీడియోలు నా దగ్గరున్నాయ్.. ఎక్కువ చేశావంటే వాటిని బయటపెడతా’ అని బెదిరించసాగాడు.

నీ ఇష్టం వచ్చింది చేస్కో!

ఆ యువకుడు ఇష్టానుసారం మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతండటంతో ఏ మాత్రం తగ్గని ముద్దుగుమ్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘నీ ఇష్టం వచ్చింది చేసుకోపో’ అంటూ లెక్క చేయకుండానే మాట్లాడేసింది. అనంతరం సదరు యువకుడితో చాటింగ్‌ విషయాన్ని.. ఆ యువకుడి ఫొటోతో సహా బయటపెట్టింది. ఇలాంటి వెధవలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అభిమానులతో షేర్ చేసుకుంది. మరి ఆ యువకుడి పరిస్థితి ఫైనల్‌గా ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి.

More News

కరోనాకు ఇదే అసలైన మందు..: మహేశ్ బాబు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలా వరకు జనాల్లోకి వెళ్లలేదు.

కరోనాపై పోరాటం.. స్వీయ నిర్భందంలో ప్రియదర్శి

కరోనాపై టాలీవుడ్ పోరాటం చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, ఫంక్షనలు దాదాపు అన్నీ బంద్ చేసేసింది.

సీతారాముల పెళ్ళికి ఎవరూ రావొద్దు : మంత్రి ప్రకటన

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ మొదలుకుని థియేటర్స్, జిమ్స్ ఇలా అన్నీ బంద్ చేసేసింది.

కరోనా ఎఫెక్ట్ : ఫ్లాట్ ఫాం టికెట్ ధర భారీగా పెంపు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

పోలీసుల‌కు లావ‌ణ్య త్రిపాఠి కంప్లైంట్‌

త‌న‌ను పెళ్లి చేసుకున్నానంటూ చెబుతున్న వ్య‌క్తిపై హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. సైబ‌రాబాద్ పోలీసుల‌కు మెయిల్ ద్వారా లావ‌ణ్య త్రిపాఠి కంప్లైంట్ చేశారు.