మద్యం, స్మోకింగ్ విమర్శలపై స్పందించిన నమిత
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ చిత్ర పరిశ్రమకు శృంగార తారగా పరిచయమైన హీరోయిన్లలో నమిత ఒకరు. ఇటీవలి కాలంలో ఆమె తరచూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. వివాహానికి ముందు.. ఆ తర్వాత విపరీతంగా నమిత లావెక్కడంతో ఆమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో నమిత సినీ సాంస్కృతిక కార్యక్రమాలు, షాపుల ఓపెనింగులకే పరిమితమైంది. అయితే ఈ మధ్య ఆమె బాగా లావు తగ్గారు. తన శరీర బరువును తగ్గించేందుకు జిమ్‌లో పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. ఇటీవలి కాలంలో ఈ బొద్దుగుమ్మ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.
దీనికోసం లావు తగ్గించుకునే క్రమంలో ఎక్కువ సమయాన్ని నమిత జిమ్‌లోనే గడుపుతోంది. తాజాగా ఆమె తన కసరత్తులు చేసే ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నమితను చూసిన వారు షాక్ అయ్యారు. నిజంగా తాము చూస్తున్నది నమితనేనా.. కాదా? అని ఆశ్చర్యానికి గురయ్యారు. అంతలా మారిపోయింది నమిత. చాలా స్లిమ్‌గా అయిపోయి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్టింగ్ డేస్‌ని నమిత గుర్తు చేసింది. అయితే నమితపై కోలీవుడ్‌లో ఆమె లావుపై ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె లావెక్కడానికి కారణం అధికంగా మద్యం సేవిండంతో పాటు స్మోకింగ్ చేయడమేనంటూ కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.
తనపై నడుస్తున్న ప్రచారంపై తాజాగా నమిత స్పందించారు. కొన్నేళ్ళుగా తాను మానసిక సమస్యతో బాధపడుతూ వచ్చానని, ఇలాంటి సమస్య ఉందనే విషయం కూడా తనకే తెలియదని,
అనేక నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. నిద్రకోసం అతిగా భోజనం చేశానని, ముఖ్యంగా పిజ్జా, బర్గర్లు అధికంగా తిన్నానని చెప్పారు. ఈ కారణంగానే తన బరువు విపరీతంగా పెరిగింది తప్ప మద్యం, పొగతాగడం అనే రెండు వ్యసనాలకు తాను ఎప్పుడూ బానిసగా మారలేదన్నారు. అలాగే థైరాయిడ్ సమస్య కూడా తన బరువు పెరగడానికి ఒక కారణమని చెప్పారు. సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని నమిత వాపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments