ఇప్పుడు నమితను చూస్తే షాక్ అవడం ఖాయం..

  • IndiaGlitz, [Monday,February 01 2021]

తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో బొద్దుగుమ్మ అనగానే గుర్తొచ్చే పేరు నమిత. కానీ ఇప్పుడు అలా అనడానికి వీల్లేదు. హీరోయిన్‌‌గా నమిత మంచి పేరు సంపాదించుకుంది. ఇటు కోలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని బాగానే సంపాదించింది. తెలుగులో కంటే తమిళ్‌లో ఎక్కువ సినిమాలు చేయడమే కాకుండా స్టార్‌ హీరోల సరసన సైతం నటించింది. తమిళ రియాల్టీ షో బిగ్‌బాస్‌లో కూడా పాల్గొంది. తరువాత శరీర తీరులో బాగా మార్పు వచ్చింది. దీంతో సినిమా అవకాశాలు ఆమెకు తగ్గిపోయాయి. బిగ్‌బాస్ షో తర్వాత ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.

కొన్ని టీవీ కార్యక్రమాల్లో మాత్రమే నమిత పాల్గొంటూ వస్తోంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్రను నమిత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు చాలా పెద్ద బ్రేక్ ఇచ్చింది. పెళ్లి తర్వాత నమిత మరింత లావై పోయింది. అంతగా లావెక్కిన నమితను చూసిన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో నమిత ఓ కఠిన నిర్ణయం తీసుకుని, తన శరీర బరువును తగ్గించేందుకు జిమ్‌లో పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది. అదే సమయంలో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.

ఇందుకోసం ఎక్కువ సమయాన్ని జిమ్‌లోనే గడుపుతోంది. తాజాగా ఆమె తన కసరత్తులు చేసే ఓ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు నమితను చూసిన వారు షాక్ అవుతున్నారు. నిజంగా తాము చూస్తున్నది నమితనా.. కాదా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతలా మారిపోయింది నమిత. చాలా స్లిమ్‌గా అయిపోయి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్టింగ్ డేస్‌ని నమిత గుర్తు చేస్తోంది. నమిత వర్కవుట్స్ వీడియో వైరల్‌ కావడంతో నమిత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.