తెలుగులో నటిస్తున్న నమిత....
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్.కె.స్టూడియోస్ అధినేత రాజ్‌కుమార్.ఎం నిర్మాణ సారథ్యంలో రూపొందిన గుంటూరు టాకీస్ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్.కె.స్టూడియోస్ రాజ్‌కుమార్.ఎం దర్శక నిర్మాణంలో గుంటూరు టాకీస్ సీక్వెల్ గుంటూరు టాకీస్ 2 ప్రారంభమైంది. అయితే సీనియర్ నరేష్ మినహా ఈ సీక్వెల్‌లో నటీనటులందరూ మారిపోయారు.
బాలీవుడ్ సెక్సీస్టార్ సన్నిలియోన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో నికిషా పటేల్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా నమిత నటించనుంది. ప్రస్తుతం నమితతో చర్చలు జరుగుఉతున్నాయి. సింహా తర్వాత నమిత మరో తెలుగు సినిమాలో నటించలేదు. బొద్దుగా ఉన్న నమిత ఇప్పుడు స్లిమ్‌గా తయారవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments