వైఎస్, జగన్ దంపతుల పేర్లు కలిసొచ్చేలా డిప్యూటీ సీఎం కూతురికి నామకరణం
Send us your feedback to audioarticles@vaarta.com
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణికి ఇటీవల పాప పుట్టిన విషయం తెలిసిందే. పుష్ప శ్రీవాణి దంపతులకు తొలి సంతానంగా జన్మించిన ఆ పాపకు నేడు నామకరణ మహోత్సవం జరిగింది. పాపకు పెట్టిన పేరు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమకున్న అభిమానాన్ని చాటుకునేలా పాపకు పేరు పెట్టడం విశేషం. పాప పేరులో వైఎస్‌తో పాటు జగన్ ఆయన సతీమణి భారతి పేర్లు కలిసొచ్చేలా నామకరణం చేశారు.
వైఎస్ అక్షరాలతో పాటు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిసొచ్చేలా ‘యశ్విత శ్రీజగతి’ అని నామకరణం చేశారు. విజయనగరం జిల్లా చినమేరంగిలోని స్వగృహంలో శనివారం నిర్వహించిన నామకరణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి బొత్స తదితరులు హాజరయ్యారు. తమ కుమార్తెకు యశ్వితలో మొదటి అక్షరం వై, శ్రీలో మొదటి అక్షరం ఎస్ కలిపితే వైఎస్ అని, తమ నాయకుడు జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిపి జగతి అని నామకరణం చేశామని పుష్పశ్రీవాణి దంపతులు వివరించారు.
కాగా.. గత బుధవారం తమ కుమార్తెను తీసుకొని తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎం జగన్ యశ్వితను జగన్ ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారికి నుదుటిపై ముద్దుపెట్టి జగన్ ఆశీర్వదించారు. తమ బిడ్డను ఆశీర్వదించిన సీఎం జగన్ కు పుష్పశ్రీవాణి దంపతులు కృతక్షతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com