'నమస్తే నేస్తమా` తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది - దర్శక నిర్మాత కె.సి.బొకాడియ
Send us your feedback to audioarticles@vaarta.com
కె.సి.బొకాడియ...చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎందరో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్ సాధించిన బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్. లేటెస్ట్‌గా లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్‌బస్టర్‌హిట్ సాధించిన 'తేరి మెహర్భానియా' చిత్రానికి పార్ట్-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. రెండు కుక్కలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. హీరో శ్రీరామ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. జనవరి 3న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా..హైదరాబాద్ ది ప్లాజా హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్ ఫిలిం మేకర్ కె.సి.బొకాడియ, చిత్ర సమర్పకులు గౌతమ్ చంద్ రాథోర్, రాజ్ కుమార్ బొకాడియ పాల్గొన్నారు..
పాపులర్ ఫిలిం మేకర్ కె.సి. బొకాడియ మాట్లాడుతూ - ''రాజస్థాన్ లోని చిన్న గ్రామం నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో మొదటి సారి సంజీవ్ కుమార్‌తో 'రివాజ్' సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆతరువాత అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సన్నీదేవన్, సైఫ్ వాళ్ళూ ఖాన్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి, జయప్రద, ఇలా 100కు పైగా స్టార్ హీరోలతో, స్టార్ హీరోయిన్లతో వర్క్ చేశాను. అతి తక్కువ సమయంలో 50 సినిమాలు తీసిన నిర్మాతను కాబట్టి నన్ను ‘ఫాస్టెస్ట్ ప్రొడ్యూసర్’ అంటారు. చెన్నైలో రజనీకాంత్ ఇల్లు, మా ఇల్లు దగ్గర దగ్గరే ఉండేవి. రజిని కాంత్ గారు నాకు చాలా క్లోజ్. ఆయనతో రజనీతో నేను ‘ఫూల్ బనే అంగారే, త్యాగీ, ఇన్‌సానియత్ కా క్యా హోగా, ఇన్‌సాఫ్ క్యా కరేగా?, అస్‌లీ– నక్లీ’ సినిమాలు చేశాను. 1985లో 'ప్యార్ జుక్తా నహి', 'తేరి మెహర్భానియా', 'ఆజ్ కాఅర్జున్' సూపర్ హిట్ సాధించాయి. నా మొదటి సినిమాకే అమితాబ్ బచ్చన్ ని డైరెక్ట్ చేయడం మర్చిపోలేను. మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద 'బి.ఎం.బి' ప్రొడక్షన్ స్టార్ట్ చేసి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరితో సినిమాలు నిర్మించాను. మా ప్రొడక్షన్‌లో వచ్చిన అన్నీ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. నిర్మాత గా సున్నా నుంచి మొదలై టాప్ పొజిషన్‌లోకి వచ్చాను. మధ్యలో కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు మళ్లీ 'నమస్తే నేస్తమా` తో ప్రయాణం ప్రారంభిస్తున్నాను.
ఈ సినిమా విషయానికి వస్తే..రెండు కుక్క పిల్లలు చిన్నప్పుడే విడిపోయి ఒకటి పోలీసుల దగ్గర, మరోటి దొంగల దగ్గర పెరుగుతాయి. శ్రీరామ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశారు. అతను హత్యకు గురవుతాడు. ఈ రెండు కుక్కపిల్లలు కలిసి బాస్‌ని చంపిన వాళ్ల మీద ఎలా పగ తీర్చుకున్నాయి? ఆ క్రమంలో ఎలాంటి సాహసాలు చేశాయి? చివరికి రెండు కుక్కపిల్లలు ఎలా కలుసుకున్నాయి అనేది కథ. నాజర్, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర మంచి పాత్రలలో కనిపిస్తారు. బ్రహ్మానందం పోలీస్ డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చే అధికారిగా కనిపిస్తారు. నాకు చాలా ఇష్టమైన 'తేరి మెహర్భానియా' ఇన్స్పిరేషన్‌తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్ అవుతుంది అనుకుంటున్నాను.
ఈ సినిమాలో రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. రెండు కుక్కలతో షూటింగ్ చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు ఆ డాగ్స్ తో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. బాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి రెండు పాటలు కంపోజ్ చేశారు. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తాయి. అలాగే న్యూ టాలెంట్ చరణ్ అర్జున్ మరో రెండు పాటలకి సంగీతం చేశారు అవికూడా చాలా బాగా వచ్చాయి.
ప్రస్తుతం భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీయే బెస్ట్ ఇండస్ట్రీగా ఉంది. ఇక్కడ హిట్ అయినా సినిమాలు అన్ని భాషలలో రీమేక్, డబ్బింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం రెండు మూడు మూవీస్ తెలుగులో చేయాలి అనుకుంటున్నా. మా బేనర్ లో వర్క్ చేయాలి అనుకునే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి ఇదే మా ఆహ్వానం. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాకు ఎంతో సహకరిస్తున్న బి.ఎ.రాజు గారికి ధన్యవాదాలు. జనవరి 3 న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను
చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్ రాథోర్ మాట్లాడుతూ - "మాది రాజస్థాన్. 64 సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా తనని తాను ప్రూవ్ చేసుకున్న బొకాడియా గారు తెలుగులో తీస్తున్న మొదటి సినిమా . ఆయన గురించి నేను చెప్పడం అంటే సూర్యుడికి వెలుగు చూపించినట్లు ఉంటుంది. ఈ సినిమా విజయం మాకు తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను" అన్నారు.
రాజ్ కుమార్ బొకాడియ మాట్లాడుతూ - "నన్ను బొకాడియా గారే ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. దర్శకుడిగా తొలి సినిమా (ఆజ్ కా అర్జున్)ను అమితాబ్ బచ్చన్ గారితో తీశారు. అలాగే రజనీకాంత్‌తో ఐదు సినిమాలు, విజయశాంతి, శ్రీదేవి ఇలా ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్స్, దర్శకులతో వర్క్ చేసిన బొకాడియా గారు తెలుగులో పరిచయం అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.
శ్రీరామ్ (గెస్ట్ అప్పీరియన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్, సంగీతం: బప్పిలహరి, చరణ్ అర్జున్, ఎడిటర్: బి. లెనిన్, ఫైట్స్: బి.జె శ్రీధర్, సమర్పణ: లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్, కో-ప్రొడ్యూసర్: ఎస్.ఆర్ చాప్లాట్, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్ అండ్ మాగ్నెటిక్స్ లిమిటెడ్, రచన- దర్శకత్వం: కె.సి. బొకాడియా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout