‘నల్లమల’మోషన్ పోస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని కథలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి గట్స్ తోనే రూపొందుతోన్న సినిమా ‘నల్లమల’.ఇప్పటికే సేవ్ నల్లమల అనే నినాదంతో ఎంతోమంది అభ్యుదయ వాదులు, అటవీ సంరక్షులు ఎన్నో పోరాటాలు నిరసనలు చేస్తున్నారు. అసలు నల్లమలకు ఏమైంది. ఆ అడవిని ధ్వంసం చేయాలని చూస్తున్నది ఎవరు.. వంటి విషయాలను చర్చిస్తూ.. అలాంటి అంశాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన ఓ గొప్ప వీరుని కథే ‘నల్లమల’.నల్లమల నేపథ్యంలో రకరకాల పాయింట్స్ చుట్టూ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాలను ఆవిష్కరిస్తూ సాగే కథ ఇది.
ఇలాంటి చీకటి ఒప్పందాలకు వ్యతిరేకంగా తన భవిష్యత్ తరాల కోసం పోరాటం సాగించిన ఒక వీరుడు ఎదుర్కొన్న సమస్యలు, వాటిని అతనెలా పరిష్కిరించడు అంటూ పూర్తిగా వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే సినిమాగా వస్తోంది నల్లమల. వాస్తవ సంఘటనలే అయినా లవ్, ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా తెరకెక్కుతోందీ చిత్రం. కథే ప్రధాన బలంగా వస్తోన్న నల్లమల చిత్రం లో అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments