రామ్ గోపాల్ వర్మకు షాకిచ్చిన నల్గొండ కోర్టు...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నల్గొండ ఎస్పీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ఆయన ‘మర్డర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిలిపి వేయాలంటూ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే తాను ప్రణయ్, అమృతల కథను తెరకెక్కించడం లేదని.. ఆ కథను ఇన్‌స్పిరేషన్‌గా మాత్రమే తీసుకున్నానని వర్మ వెల్లడించారు. కానీ ఆయన ఇటీవల విడుదల చేసిన ‘మర్డర్’ సినిమా ట్విట్టర్‌ పోస్టులు, సినిమా ట్రైలర్‌ను చూస్తే.. ఏమాత్రం మార్పు లేకుండా అమృత, ప్రణయ్‌ల కథనే తెరకెక్కించారని స్పష్టమవుతోంది.

ఈ కేసు నల్గొండ ఎస్పీ, ఎస్టీ కోర్టులో విచారణ నేడు జరిగింది. తమ కుటుంబాన్ని సంప్రదించకుండానే వర్మ ఈ సినిమా తీస్తున్నారని, తమ కులాన్ని కించపరిచేలా వర్మ సినిమా రూపొందిస్తున్నారని పిటీషన్‌లో అమృత, బాలస్వామి పేర్కొన్నారు. ఈ సినిమా కారణంగా ప్రణయ్ హత్య కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టుకు వెల్లడించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ‘మర్డర్’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వులపై హైకోర్టుకు వెళతామంటు వర్మ తరపు న్యాయవాది తెలిపారు.

కాగా.. ‘మర్డర్’ సినిమా దాదాపు విడుదలకు సిద్ధమైన ఈ సమయంలో సినిమా విడుదలను నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వర్మకు షాక్ తగిలినట్టైంది. ఈ విషయమై స్పందించిన ఆర్జీవీ.. ‘మర్డర్’ సినిమాతో ఇతరులను చెడుగా చూపించడం తన ఉద్దేశం కాదన్నారు. ఈ సినిమా విషయంలో ఒక్కొక్కరి దృష్టి కోణం ఒక్కోలా ఉండి ఉండొచ్చని... అయితే దర్శక, నిర్మాతగా తన ఆలోచనల ప్రకారం మర్డర్ సినిమాను తెరకెక్కించే హక్కు తనకుందన్నారు. ఏ వ్యక్తి చెడు కాదని తాను నమ్ముతానని.. కొందరిని చెడుగా చూపించేందుకే ఈ సినిమాను తీస్తున్నాననుకోవడం సరికాదన్నారు. మనుషుల ఫీలింగ్స్‌పై తనకు గౌరవముందని.. వారు పడిన బాధను, నేర్చుకున్న పాఠాన్ని గౌరవిస్తూ మర్డర్ తీశానని వర్మ తెలిపారు.

More News

అదంతా పుకారు.. ఇంకా నాన్నగారు లైఫ్ సపోర్ట్‌పైనే ఉన్నారు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన అబద్ధమని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

అధ్యక్షురాలిగా కొనసాగలేనన్న సోనియా... లేఖపై రాహుల్ ఫైర్..

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 48 మంది సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి కరోనా నెగిటివ్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు, సినీ ఇండస్ట్రీ చేసిన ప్రార్థనలు ఫలించాయి.

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా.. వారానికి 4 లక్షల చొప్పున పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా వైరస్ తీవ్రత భారీగా పెరిగిందన్నారు.

తెలంగాణలో కొత్తగా 1842 కేసులు..

రెండు రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటివేయగా..