నాకో ఇంకో పేరుంది అంటున్న సమంతా...

  • IndiaGlitz, [Friday,March 18 2016]

స‌మంత ఇంకో పేరు ఏమిట‌ని తెగ ఆలోచిస్తున్నారా..? సంగీత ద‌ర్శ‌కుడిగా అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ఇమేజ్ ఏర్ప‌రుచుకున్న యువ సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ..సంగీతం అందిస్తున్న తాజా చిత్రం నాకో ఇంకో పేరుంది. శ్యామ్ ఆంటోని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తుంది.
ఈ చిత్రంలో జి.వి. ప్ర‌కాష్ స‌ర‌స‌న త్రిష లేదా న‌య‌న‌తార సినిమాలో న‌టించిన ఆనంది హీరోయిన్ గా న‌టిస్తుంది. అయితే ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ను స‌మంత ట్విట్ట‌ర్ ద్వారా ఈరోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జి‌వి ప్రకాష్ మాట్లాడుతూ.. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. మేము ఊహించిన దానికంటే సినిమా చాలా బాగా వస్తుంది. ఈ చిత్రంలో నా పేరు జాని. 1980లో జాని టైటిల్ తో రజనీకాంత్ గారి సినిమా విడుదల అయ్యింది. ర‌జ‌నీకాంత్ గారి టైటిల్ నా క్యారెక్ట‌ర్ పేరు కావ‌డం హ్యాపీగా ఉంది. త్వ‌ర‌లో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమంతా మా మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది అన్నారు.

More News

బాలల హృదయాల్ని దోచుకున్న హీరో సంపూర్ణేష్ బాబు...

హృదయకాలేయం చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఏర్పర్చుకున్నాడు హీరో సంపూర్ణేష్ బాబు.తన దైన పాత్రలతో, వైవిధ్యమైన గెటప్పులతో అలరిస్తున్నాడు.

మాస్ హీరో విశాల్ హీరోగా 'టెంపర్' రీమేక్

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ హీరోగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సూపర్ డూపర్ హిట్ అయిన ‘టెంపర్’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు.

సునీల్ న్యూమూవీ టైటిల్...

కమెడియన్ టర్నడ్ సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్.పి.ఎ క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.సుదర్శనరెడ్డి నిర్మిస్తున్నారు.

రజనీకాంత్ 'కబాలి' రిలీజ్ డేట్....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం ‘కబాలి’.

పవర్ స్టార్ ను అవమానించిన హీరో....

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.