కేసీఆర్ మోసం చేశారు.. నాయిని షాకింగ్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై.. మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే మొదటి, రెండోసారి కేబినెట్ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే రెండోసారి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో మీడియా ముందుకు వచ్చిన నాయిని తన అసంతృప్తిని వెల్లగక్కారు. కేబినెట్ విస్తరణ చేపట్టిన మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై ఊహించని కామెంట్స్ చేశారు.
హోం మంత్రిగా పనిచేసిన నేను ఆర్టీసీకా!
‘కేసీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు. కానీ రెండుసార్లు విస్తరణ జరిగినప్పటికీ మంత్రి పదవి ఇవ్వలేదు. కేసీఆర్ మాటతప్పారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే కేసీఆర్ వద్దన్నారు.. ఎమ్మె్ల్సీగానే కొనసాగాలని కోరారు. నాకు మంత్రి పదవి ఇస్తానని గతంలో కేసీఆర్ మాట ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే... ముఠా గోపాల్ను గెలిపించుకునిరా.. మంత్రిని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. నా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ నాకు మాటిచ్చారు. నాకు ఆర్టీసీ చైర్మన్ సహా ఎలాంటి కార్పొరేషన్ పదవి వద్దు. ఆ పదవి నాకు వద్దు. అందులో రసం లేదు. హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకు?. కేసీఆర్ మా ఇంటికి పెద్ద అని.. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో వాళ్లిష్టం’ అని నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈటల రాజేందర్, ఆ తర్వాత రసమయి బాలకిషన్... తాజాగా మాజీ హోం మంత్రి.. సీఎం కేసీఆర్పై తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కడం గమనార్హం. మరి ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో.. నాయినికి ఎలాంటి పదవి ఇచ్చి శాంతపరుస్తారో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout