నాయిని సతీమణి మృతి.. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణించి ఐదు రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి అహల్య(68) మరణించారు. కరోనా కారణంగా బాధపడుతున్న ఆమె బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి నాయినితోపాటు, ఆయన సతీమణి అహల్య కూడా అక్కడే క్రిటికల్ కేర్ వార్డులో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే నాయిని ఈ నెల 21న తుదిశ్వాస విడిచారు. కాగా.. ఈ నెల 22న భర్తను కడసారి చూసేందుకు అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ సపోర్టుతో, వీల్‌చైర్‌పై తీసుకొచ్చారు. అంత్యక్రియలు పూర్తైన వెంటనే తిరిగి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఐదు రోజుల వ్యవధిలోనే ఆమె కూడా సోమవారం తుదిశ్వాస విడిచారు. అహల్య మరణవార్త తెలియగానే బంధువులంతా ఆస్పత్రి వద్దకు చేరుకుని తీవ్ర ఆవేదన చెందారు.
ఐదు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి కుమారుడు దేవేందర్‌రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా అహల్య అంత్యక్రియలను నేటి మధ్యాహ్నం గచ్చిబౌలిలోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అహల్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout