నాగు గవర రెండవ చిత్రం ప్రీలుక్ కి మంచి స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
"బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్" లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మించనున్న తెలుగు స్ట్రయిట్ సినిమా టైటిల్ ప్రీలుక్ ను ఇటీవల విడుదల చేశారు.
"వీకెండ్ లవ్" తో దర్శకుడిగా పరిచయమైన జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా వసంత్ సమీర్, సెహర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ.. "మా సంస్థ నుంచి ఇప్పటివరకూ వచ్చిన అన్నీ డబ్బింగ్ సినిమాలకంటే వైవిధ్యంగా ఈ స్ట్రయిట్ సినిమా ఉండబోతోంది. నాగు గవర రాసుకొన్న కథ మాకు విపరీతంగా నచ్చింది. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ కు గురి చేసే ఈ చిత్రం ప్రీలుక్ పోస్టర్ ను "#KKK" అని విడుదల చేసినప్పట్నుంచి టైటిల్ ఏంటా అనే ఉత్సుకత అందరిలో మొదలైంది. అందరి అంచనాలను మించే విధంగా చాలా విభిన్నమైన కథ-కథనాలతో మాత్రమే కాదు వైవిధ్యమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాం" అన్నారు.
దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. "వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, ఈ సినిమా చేస్తున్నాను . చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్ లొ ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీలుక్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్ట్ మొదటివారంలో డిఫరెంట్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను పలకరించనున్నాం" అన్నారు.
వసంత్ సమీర్, సెహర్, రవివర్మ, శ్రీహర్ష, జబర్దస్త్ రాంప్రసాద్, రఘుబాబు, కాదంబరి కిరణ్, నీలిమ, జయప్రకాష్, శ్రీసుధ, కాశీవిశ్వనాధ్, సంధ్య పెద్దాడ, రమణారెడ్డి, కృష్ణతేజ, మహేందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దుర్గాకిషోర్ బోయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: అనీ మాస్టర్, కాస్ట్యూమ్స్: టి.ఎస్.రావు, కాస్ట్యూమ్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన-దర్శకత్వం: నాగు గవర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com