పరిణీతి ఎంట్రీపై నెగటివ్ టాక్
- IndiaGlitz, [Wednesday,October 28 2015]
'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ప్రియాంకా చోప్రా సిస్టర్ పరిణీతి చోప్రా నటించే అవకాశముందన్నది టాలీవుడ్ లేటెస్ట్ టాక్. బాలీవుడ్లో మంచి పెర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న పరిణీతి.. ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టడం నిజంగా స్పెషల్ న్యూసే. ఎటొచ్చి చోప్రా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ హీరోయిన్ కూడా ఇక్కడ చేసిన తొలి సినిమాలతో విజయాలను అందుకోలేకపోయారు.
ప్రియాంకా సంగతి తీసుకుంటే.. పదమూడేళ్ల క్రితం ఆమె చేసిన తొలి తెలుగు చిత్రం 'అపురూపం' ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. రామ్‌చరణ్‌తో చేసిన 'తుఫాన్' అయితే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక మరో చోప్రా గర్ల్ మీరా చోప్రా.. 'బంగారం'తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా రిజల్ట్ పాజిటివ్ అయితే కాదు. ఆ తరువాత చేసిన సినిమాలు కూడా ఆడలేదు. అదే విధంగా ప్రియాంకా మరో కజిన్ బార్బీ (మన్నారా చోప్రా) చేసిన 'ప్రేమా గీమా జాన్తా నై' అయితే రిలీజ్ అయిందనే విషయం తెలియనంత ఫలితాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పరిణీతి ఎంట్రీ టాలీవుడ్లో నెగెటివ్ టాక్‌కి ఆజ్యం పోస్తోంది. మరి తన కజిన్స్ అందుకోని విజయాన్ని పరిణీతి అయినా అందుకుంటుందో లేదో చూడాలి.