నాగశౌర్య, కేపి రాజేంద్ర కాంబినేషన్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ చిత్రం `పోలీసు వారి హెచ్చరిక`
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో నాగశౌర్యహీరోగా కేపీ రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `పోలీసు వారి హెచ్చరిక`. శిఖర కోనేరు సమర్పణలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. జనవరి 22 హీరో నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు (జనవరి 21) సాయంత్రం 5:15 నిమిషాలకు `పోలీసు వారి హెచ్చరిక` టైటిల్ పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. `మార్చి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి ఈ ఏడాది ద్వితీయార్థంలో మూవీని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం` అని నిర్మాత మహేష్ ఎస్ కోనేరు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments