నాగశౌర్య రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా...`లోని కృష్ణవేణి వీడియో సాంగ్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...`. రొమ్‌కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న ఆహా ఓటీటీలో విడుదలవుతుంది. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ స్వర పరిచిన అన్ని పాటలు సంగీతాభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రంలోని పెప్పీ ట్రాక్ కృష్ణవేణి ..కృష్ణవేణి వీడియో సాంగ్‌ను యంగ్ హీరో నాగశౌర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వెబినార్‌లో..
యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - `` ఈ సినిమాలోని కృష్ణవేణి..కృష్ణవేణి పాట నేను చూశాను. లిరిక్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ డాన్స్ నాకు బాగా నచ్చింది. రాజ్, మాళవిక ఇద్దరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే డైరెక్టర్ విజయ్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ఈ సినిమా అందరికీ నచ్చి ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ``విజయ్ గారు, అనూప్ నాతో పట్టుబట్టి ఈ సాంగ్ చేయించారు. ఆ క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే చెందుతుంది `` అన్నారు.
దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ - `ఈ సినిమాలో రాజ్ తరుణ్‌తో ఎలాగైన ఫుల్ ఎనర్జీతో ఒక సాంగ్ చేయించాలని డిసైడ్ అయ్యి ఈ సాంగ్ ప్లాన్ చేశాం. రాజ్ తరుణ్ విత్ ఔట్ ప్రాక్టీస్ ఈ సాంగ్ చేశారు. చాలా బాగా వచ్చింది`` అన్నారు.
చిత్ర నిర్మాత కె.కె.రాధా మోహన్ మాట్లాడుతూ - `` శేఖర్ మాస్టర్ మా బేనర్లో వచ్చిన ఏమైంది ఈ వేళ మూవీలో ఒక సాంగ్ కొరియోగ్రఫి చేశారు. అప్పటినుండి ఆయనతో మంచి పరిచయం ఉంది. ఈ సినిమాలో అన్ని పాటలు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. అనూప్ మ్యూజిక్ బాగా కుదిరింది. గాంధి జయంతి కానుకగా అక్టోబర్ 2న ఆహాలో సినిమా విడుదలవుతుంది.`` అన్నారు.
హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ - ``కృష్ణవేణి పాట రిలీజ్ చేసిన నాగశౌర్య గారికి థాంక్స్. అక్టోబర్ 2న అందరూ సినిమా చూడండి`` అన్నారు.
సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ - `` విజయ్ కుమార్ గారితో గుండెజారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం చేశాను. ఇది మా కాంబినేషన్లో వస్తోన్న మూడవ చిత్రం. ఈ పాట సిచ్యువేషన్ సినిమాలో ఒక క్రూషియల్ టైమ్‌లో వస్తుంది. అక్కడ ఫోక్ సాంగ్ అయితే బాగుంటుంది అని విజయ్ గారు నేను కలిసి నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి అని హుక్ లైన్ అనుకున్నాం. దానికి కాసర్ల శ్యామ్ గారు అద్భుతంగా లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ చక్కగా పాడారు.`` అన్నారు.
కృష్ణవేణి ..కృష్ణవేణి అంటూ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ` ఈ సినిమాలోని పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడులయ్యాయి.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout