Nagarjunasagar Dam:కేంద్రం ఆధీనంలోకి నాగార్జునసాగర్ డ్యామ్.. CRPF బలగాలు మోహరింపు

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిప్పు రాజేసిన నీటివివాదం కేంద్రం జోక్యంతో చల్లబడింది. కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ చీప్‌ సెక్రటరీలు జవహర్ రెడ్డి, శాంతికుమారి, డీజీపీలతో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నాగార్జునసాగర్ డ్యాం వద్ద పరిస్థితిపై ఆరా తీశారు. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ, డ్యామ్‌ నిర్వహణను కృష్ణా బోర్డుకి అప్పగించడంతో పాటు CRPF దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో కేంద్ర బలగాల ఆధీనంలోకి డ్యామ్ వెళ్లిపోయింది. అయితే ఇప్పటికీ అటు ఏపీ.. ఇటు తెలంగాణ పోలీసులు మోహరించే ఉన్నాయి.

కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో సమావేశం..

ఇక కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమావేశం జరుగనుంది. ఏపీ, తెలంగాణ చీఫ్‌ సెక్రటరీలు, సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ డీజీలు..సీడబ్ల్యూసీ , కేఆర్‌ఎంబీ చైర్మన్‌లు ఈ మీటింగ్‌లో పాల్గొంటారు. సాగర్‌తో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిర్వహణపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఈ కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి,తెలంగాణకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 12కు వాయిదా వేసింది.

నీటి విడుదల ఆపే ప్రసక్తే లేదు..

ఇప్పటికే నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై తమకు ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. కానీ ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ మాత్రం నీటి విడుదల ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల చేతిలో ఉండే ప్రాజెక్టుల నిర్వహణ అంశం.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దూకుడు వల్ల రెండు కేంద్రం చేతిలోకి వెళ్లిపోయిందని నిపుణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

More News

Salaar Trailer: ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్... 'సలార్' ట్రైలర్... ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 'సలార్ పార్ట్ 1' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Police Son:పోలీస్ కొడుకు ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి..

అతివేగం అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకం అని పోలీసులు తరుచూ ప్రకటనలు చేస్తూనే ఉంటారు.

Pawan Kalyan:ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడే పోరాటం చేశా: పవన్ కల్యాణ్‌

జనసేనకు యువతే పెద్ద బలమని.. రాష్ట్రంలో ఆరున్నర లక్షల క్యాడర్‌ ఉందని జనసేనాని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Krishna Board:తక్షణమే సాగర్ నీటి విడుదల ఆపండి.. ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశాలు..

నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి వెంటనే నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది.

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పచ్చ నేతల నీతులు.. మీరా మాట్లాడేది..?

అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన సత్తారు వెంకటేష్ రెడ్డి ఎన్నారై వైసీపీ నేత అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది.