నాగార్జున మరో కోణాన్ని ఎలివేట్ చేస్తున్న 'వైల్డ్ డాగ్'
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున అంటే రొమాంటిక్ సినిమాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. మాస్ పాత్రల్లో నాగార్జున మెప్పించిన సినిమాలు తక్కువే. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నాగార్జున వైవిధ్యమైన సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతున్నాడు. అందులో భాగంగా నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇందులో నాగార్జున వినయ్ వర్మ అనే ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన నాగార్జునని సినిమాలో అందరూ ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్2న విడుదలవుతుంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
ట్రైలర్‌ను చూస్తే గోకుల్ చాట్ సహా దేశంలో జరిగిన కొన్ని టెర్రర్ దాడులకు కారణమైన ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి వైల్డ్‌డాగ్ అండ్ టీమ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనే కథాంశంతో సినిమా రూపొందినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com