రాఘవేంద్రరావు గారు ఇదే ఆఖరి సినిమా అంటున్నారు... మనంలా ఓం నమో వేంకటేశాయ క్లాసిక్ గా నిలవాలి - నాగార్జున

  • IndiaGlitz, [Sunday,January 08 2017]
న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం నమో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకం పై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించారు. హ‌థీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్, విమ‌లారామ‌న్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందించిన ఓం న‌మో వేంక‌టేశాయ ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను బాహుబ‌లి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని సంయుక్తంగా రిలీజ్ చేసారు. ఆడియో సీడీను వినూత‌న్నంగా ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామి శంఖు, చ‌క్రాల్లోంచి నాగ‌చైత‌న్య‌, అఖిల్ తీసి ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌గ్యా జైస్వాల్ మాట్లాడుతూ... ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు చిత్రాలు చూసాను. చాలా గొప్ప సినిమాలు అవి. ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్ర‌రావు గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అలాగే నాగ్ సార్ కి కూడా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలోని పాట‌లు అందరికీ న‌చ్చుతాయి అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
ర‌చ‌యిత జె.కె.భార‌వి మాట్లాడుతూ.... ఒక వీడియో షాపులో క్యాసెట్స్ అద్దెకు ఇచ్చే కుర్రాడు నాగార్జున‌కు క‌థ చెబితే ఈ క‌థ‌కి నువ్వే డైరెక్ట‌ర్ అని చెప్పారు. అత‌నే రామ్ గోపాల్ వ‌ర్మ అదే శివ. ఈ సినిమాతో ఇండ‌స్ట్రీని అల్ల‌క‌ల్లోలం చేసేసారు. కృష్ణ‌వంశీతో నిన్నే పెళ్లాడ‌తా అనే అద్భుతాన్ని తెలుగు ప్రేక్షకులు అందించారు. త‌మిళ కుర్రాడు వ‌చ్చి గీతాంజ‌లి అని క‌థ చెబితే సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంది అని ముందే చెప్పి గీతాంజ‌లి చేసారు. ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఊరు పేరు లేని జె.కె. భార‌వి వ‌చ్చి అన్న‌మ‌య్య క‌థ చెబితే తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచిపోతుంది అని ముందే చెప్పారు. త‌మిళ కుర్రాడు విక్ర‌మ్ కుమార్ వ‌చ్చి క‌థ చెబితే అద్భుతం అవుతుంది అని చెప్పారు. అదే దృశ్యకావ్యం మ‌నం. హాలో బ్ర‌ద‌ర్, మ‌న్మ‌ధుడు, సోగ్గాడే చిన్ని నాయ‌నా...ఇలా నాగార్జున ఎన్నో విభిన్న పాత్ర‌లు పోషించారు. నాగార్జున గారి జ‌డ్జెమెంట్ మీద నాకు బాగా న‌మ్మ‌కం. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే... వెంక‌టేశ్వ‌ర స్వామి భ‌క్తుడు క‌థ అన‌గానే...నాగార్జున అన్న‌మయ్య‌ను మించిన క‌థ ఉంటుందా అని విన‌డానికే వెనుకంజ వేసారు. ఆత‌ర్వాత క‌థ‌ విన్న రెండో నిమిషంలోనే ఈ సినిమా మ‌నం చేస్తున్నాం అని చెప్పారు. అన్న‌మ‌య్య సినిమా కంటే ఎక్కువుగా క‌దిలిస్తేనే చేస్తాను అన్నారు. అలాంటిది నాగార్జున గారు ఈ సినిమా చేసారంటే ఎంత‌లా ఆయ‌న్ని క‌దిలించి ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. అన్న‌మ‌య్య‌ను దాటిపోయేలా ప్రేక్ష‌కులు చేయాలి. ఈ క‌థ గురించి నేను, రాఘ‌వేంద్ర‌రావు గారు 10 సంవ‌త్స‌రాల నుంచి అనుకుంటున్నాం. అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్..ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. సౌర‌భ్ జైన్ ని చూడ‌గానే వెంక‌టేశ్వ‌ర‌స్వామే వ‌చ్చిన‌ట్టు అనిపించింది. ఈ చిత్రం అన్న‌మ‌య్య‌ను మించిన విజ‌యం సాధించాలి అన్నారు.
అనుష్క మాట్లాడుతూ... ఓం న‌మో వేంక‌టేశాయ ఈ చిత్రంలో నేను న‌టిస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. భ‌క్తురాలి పాత్ర పోషిస్తాను అని అస‌లు అనుకోలేదు అది కూడా నాగార్జున‌ గారితో. 2004లో ఫ‌స్ట్ టైమ్ రాఘ‌వేంద్ర‌రావు గార్ని క‌లిసాను. ప‌దేళ్ల‌కు ఒక‌సారి మాత్రం ఇలాంటి పాత్ర పోషించే అవ‌కాశం వ‌స్తుంది. నాగార్జున గారు ఇలాంటి పాత్ర‌లు చాలా చేసారు. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.
ర‌చ‌యిత వేద‌వ్యాస మాట్లాడుతూ... అన్న‌మ‌య్య,శ్రీ రామ‌దాసు, శిరిడి సాయి చిత్రాల‌ను చూసాం. నాగార్జున గారు త‌ప్ప ఇలాంటి పాత్ర‌లు ఎవ‌రూ చేయ‌లేరు. జె.కె.భార‌వి గారు అద్భుత‌మైన‌ క‌థ అందించారు. ఈ చిత్రంలో ఎక్కువ పాట‌లు రాసే భాగ్యం నాకు ద‌క్కింది. గీత ర‌చ‌యిత‌లు శివ‌శ‌క్తి ద‌త్తా, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, చంద్ర‌బోస్, అనంత్ శ్రీరామ్.. వీళ్ల‌తో పాటు నాతో కూడా పాట‌లు రాయించారు. ఈ సినిమా ఎప్ప‌టికీ శాశ్వ‌తంగా నిలిచిపోతుంది అన్నారు.
నాగ‌చైత‌న్య మాట్లాడుతూ... నాన్న‌గారు, రాఘ‌వేంద్ర‌రావు గారు కాంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడిసాయి, ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ‌. అద్భుత‌మైన చిత్రాల‌ను అందించినందుకు రాఘ‌వేంద్ర‌రావు గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నాన్న గారు విభిన్న పాత్ర‌లు పోషిస్తూ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. నాకు నాన్నే స్పూర్తి. ఓం న‌మో వేంకటేశాయ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అన్నారు.
గీత ర‌చ‌యిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ... ఒక సాధార‌ణ భ‌క్తుడికి స‌ర్వ‌ద‌ర్శ‌నం ల‌భిస్తే చాలు అనుకుంటే... నిజ ద‌ర్శ‌నం ల‌భిస్తే ఎలా ఉంటుందో.... రాఘ‌వేంద్ర‌రావు గారి సినిమాలోపాట రాసే అవ‌కాశం ల‌భిస్తే చాలు అనుకుంటే... ప‌తాక స‌న్నివేశానికి పాట రాసే అవ‌కాశం ల‌భించిన‌ప్పుడు అలా అనిపించింది. ఈ సినిమాలో పాట రాయ‌డం పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే స్వామికి కొత్త పేర్లు సృష్టించే అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్ర‌రావు గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. పాట‌కు బాణీ క‌ట్టే వారిలో కీర‌వాణి గారు ఆఖ‌రి వాళ్లు. నా అభిప్రాయం అబ‌ద్దం కావాల‌ని కోరుకుంటున్నాను. ర‌క్తి, భ‌క్తి, ముక్తి ఇలాంటి అథ్యాత్మిక చిత్రాలు నాగార్జున గారు మ‌రెన్ని చేయాలి అన్నారు.
గీత ర‌చ‌యిత రామజోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ... కొన్ని విజ‌యాలు సంక‌ల్పం అంత గొప్ప‌గా ఉంటాయి. నాగార్జున గారు, రాఘ‌వేంద్ర‌రావు గారు, కీర‌వాణి గారు కాంబినేష‌న్ లో రూపొందిన ఈ చిత్రంలో నాకు అవ‌కాశం రావ‌డం దేవుని ద‌య‌గా భావిస్తున్నాను అన్నారు.
జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ... ఈ చిత్రంలో చేసింది చిన్న క్యారెక్ట‌రే అయినా ఈ టీమ్ తో ప‌ని చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. ఇందులో నాకు బంప‌ర్ ఆఫ‌ర్ ఏమిటంటే అనుష్క‌తో సాంగ్. ఇక నాగార్జున నా ఫ్రెండ్. నాగార్జునతో వ‌ర్క్ చేయ‌డం హ్యాపీ. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
ఆంధ్ర‌ప‌దేశ్ రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ... ముక్కోటి ఏకాద‌శి రోజు ఈ పాట‌లు విన‌డం చాలా సంతోషంగా ఉంది. చ‌క్క‌టి మ్యూజిక్ అందించిన కీర‌వాణి గారికి అభినంద‌న‌లు. నాగార్జునకు అన్న‌మ‌య్య శ్రీరామ‌దాసుకి మించిన పేరు రావాల‌ని కోరుకుంటున్నాను. ఎక్కువ మందికి ఈ సినిమాని చూపించాల‌నే నిర్మాత మ‌హేష్ రెడ్డి ల‌క్ష్యం నెరువేతుంది అన్నారు.
కీర‌వాణి మాట్లాడుతూ... అన్న‌మయ్య‌, రామ‌దాసు, శిరిడి సాయి ఇప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ...! ఈ ప్ర‌యాణం చూస్తుంటే తెలుసా మ‌న‌సా ఇది ఏనాటి అనుబంధ‌మో అనిపిస్తుంది. బుద్ది బ‌లం, దైవం బ‌లం, మంత్ర బ‌లం వ‌ల‌న మిత్రులు సంక‌ల్పించిన ఈ కార్యం విజ‌య‌వంతం కావాలి అన్నారు.
మ‌హేష్ రెడ్డి మాట్లాడుతూ... వెంక‌టేశ్వ‌ర స్వామి సినిమా తీయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన నాగార్జున‌, రాఘ‌వేంద్రరావు, కీర‌వాణి టీమ అంద‌రికీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఇది మ‌రో అన్న‌మ‌య్య‌. ఈ సినిమాని చూసాను అద్భుతంగా ఉంటుంది. అన్న‌మ‌య్య రిలీజ్ అయిన‌ప్పుడు తిరుప‌తికి భ‌క్తులు పెరిగారు అని చెప్పారు. ఈ కొత్త జ‌న‌రేష‌న్ కి వెంక‌టేశ్వ‌ర స్వామి గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పాం. ఈ సినిమా ద్వారా స్వామి మ‌హాత్యాలు ఎలా ఉంటాయో తెలియ‌చేసాం. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ సినిమా పండ‌గ‌లా ఉంటుంది అన్నారు.
రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ... నాకు స్వామికి అనుబంధం ఉంది. నేను అడ‌గ‌కుండా గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడు. అంద‌రి హీరోల‌తో ప‌ని చేసే అదృష్టం క‌ల్పించాడు. అన్న‌మ‌య్య, శ్రీ రామ‌దాసు, శిరిడి సాయి చిత్రాలు చేస్తాను అని అనుకోలేదు. స్వామీ...ఇవ‌న్ని అడ‌గ‌కుండా ఇచ్చావు. నేను ఏమీ ఇవ్వాలి అనుకునేవాడిని. అలా ఆలోచిస్తున్న టైమ్ లో భార‌వి పెద్ద క‌థ తీసుకువ‌చ్చాడు. అంతే...ఆత‌ర్వాత‌ నిర్మాత మ‌హేష్ రెడ్డి, హీరో నాగార్జున, సౌర‌భ్ జైన్, అనుష్క, విమ‌లారామ‌న్, అస్మితా... ఇలా టీమ్ అంతా సెట్ అయ్యారు. స్వామీ ద‌ర్శ‌నం కావాలంటే నాగార్జున క‌ళ్ల‌తో చూడాలి. అంత‌లా ఈ సినిమాలో నాగార్జున న‌టించాడు. అనుష్క గోదావ‌రి గెట‌ప్ లో అద్భుతంగా న‌టించింది. . ఆ దేవుడు మాకు శ‌క్తి ఇవ్వ‌డం వ‌ల‌న‌ భ‌క్తితో ఈ సినిమాని తీసాం. అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను అన్నారు.
న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున మాట్లాడుతూ... ఈ సినిమాలో ఉన్న వాళ్లు అంద‌రూ నాకు చాలా ఇష్ట‌మైన వాళ్లు. జ‌గ‌ప‌తిబాబు నాకు చిన్న‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం. మై ఫ్రొడ్యూస‌ర్ మ‌హేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను డిప్ర‌ష‌న్ గా ఉన్న‌ప్పుడు ఫ‌స్ట్ ఫోన్ చేసేది మ‌హేష్ కే. ఇక కీర‌వాణి గారి గురించి చెప్పాలంటే....ఆయ‌న మ్యూజిక్ వింటే చాలు క‌ళ్లంట నీళ్లు వ‌చ్చేస్తాయి. నాకు ఎన్నో పాట‌లు అందించారు. ఆయ‌న‌ చ‌క్ర‌వ‌ర్తి గారి ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసిన‌ప్ప‌టి నుంచి ప‌రిచ‌యం. కీర‌వాణి గారి గురించి ఎంత చెప్పిన త‌క్కువే. క‌మ‌నీయం అనే పాట చేస్తున్న‌ప్పుడు వెంక‌టేశ్వ‌ర‌స్వామితో ఉన్న‌ట్టు చాలా క‌ల‌లు వ‌చ్చాయి. నేను రాఘ‌వేంద్ర‌రావు గారితో ఎక్కువ సినిమాలు చేసాను. మా ఇద్ద‌రి జ‌ర్నీ ఆఖ‌రి పోరాటంతో స్టార్ట్ అయ్యింది. గీతాంజ‌లి, శివ ఇలా ర‌క‌ర‌కాల సినిమాలు తీస్తున్న టైమ్ లో నాతో అన్న‌మ‌య్య తీసారు. నేనేంటి అన్న‌మ‌య్య ఏంటి అని నేనే అనుకున్నాను. ఆత‌ర్వాత శ్రీరామ‌దాసు, శిరిడి సాయి ఇప్ప‌డు ఓం న‌మో వేంక‌టేశాయ‌. నాకు ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అంటే మ‌ళ్లీ రాఘ‌వేంద్ర‌రావు గారితో చేస్తానో లేదో. ఎందుకంటే ఇది ఆయ‌న ఆఖ‌రి సినిమా అంటున్నారు. నాన్న‌గారి కోసం మ‌నం హిట్ అవ్వాల‌ని కోరుకున్నాను. ఇది కూడా మ‌నంలా క్లాసిక్ అవ్వాలి. ఇదే రాఘ‌వేంద్ర‌రావు గారి ఆఖ‌రి సినిమా అవ్వ‌చ్చు. అందుచేత‌ మా ఇద్ద‌రికీ బెస్ట్ ఫిల్మ్ గా నిల‌వాలి. నేను తెలుగు బాగా మాట్లాడుతుంది అన్న‌మ‌య్య త‌ర్వాతే. భార‌వి గారు క‌థ చెబుతుంటే క‌ళ్ల ముందు క‌నిపిస్తుంది. ఇంకో క‌థ చెబుతా అంటున్నారు. అది భ‌క్తి సినిమా కాదు. అనుష్క‌, విమ‌లారామ‌న్ టీమ్ అంద‌రితో వ‌ర్క్ చేయ‌డం పెంటాస్టిక్ ఎక్స్ పీరియ‌న్స్. నాకు వెంక‌టేశ్వ‌ర‌స్వామికి మ‌ధ్య‌లో కొన్ని ఎక్స్ పీరియ‌న్స్ ఉన్నాయి.
అవి ఏమిటంటే... అమ్మ పూజ‌లు చేస్తుండేవారు. అమ్మ‌తో క‌లిసి ఓసారి నేను వెంక‌టేశ్వ‌ర‌స్వామి గుడికి వెళ్లాను. ఆత‌ర్వాత ఈమ‌ధ్య నా కొత్త‌ సినిమా రిలీజ్ అవుతుంది అంటే తిరుప‌తి వెళ్లుతుండేవాడిని. తిరుప‌తి వెళ్లిన ప్ర‌తిసారి బ్యూటీఫుల్ ఎక్స్ పీరియ‌న్స్. ఎప్పుడు తిరుప‌తి వెళ్లినా అన్నీ ఇచ్చావు అని చెప్పి థ్యాంక్స్ చెప్పేవాడిని. అయితే ఫ‌స్ట్ టైమ్ అమ్మ ప‌రిస్థితి బాగోలేదు. ఉన్నా లేన‌ట్టే అని తెలిసి నాన్న ఏమీ చేయ‌లేని ప‌రిస్థితులో ఉండ‌డం చూసి అమ్మ‌ను తీసుకువెళ్లిపో స్వామి అని కోరుకున్నాను. అలా కోరుకున్న నెక్ట్స్ డే అమ్మ‌ను తీసుకెళ్లిపోయాడు. సెకండ్ టైమ్ మ‌నం సినిమా హిట్ అవ్వాలి అని అడిగాను అది కూడా ఇచ్చారు. అలాగే తిరుప‌తి వెళ్లి వ‌చ్చిన త‌ర్వాతే మా పిల్ల‌ల పెళ్లి గురించి తెలిసింది. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి, ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రాలు నేను చేయ‌డం పూర్వ జ‌న్మ సుకృతం ఏమో అనేది నాకు తెలియ‌దు.తెలుగు వారి అభిమానం..ఇంత మంది అభిమానులును ఇచ్చినందుకు స్వామీకి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌లు దిల్ రాజు, పివిపి, ఎం.ఎల్.కుమార్ చౌద‌రి, భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్, ఎస్.గోపాల్ రెడ్డి, నాగ‌సుశీల‌, సౌర‌భ్ జైన్, విమ‌లారామ‌న్, అస్మిత‌, గౌతంరాజు, ర‌ఘుబాబు, పృథ్వీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

వైరస్ ఫస్ట్ లుక్ రిలీజ్

తక్కువ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మూవీ 'వైరస్'

'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' ఓ స్పెషల్ మూవీ - సహజనటి జయసుధ

పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి,సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'.

కృష్ణా తీరాన ఉన్నానా..విశాఖ తీరాన ఉన్నానా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నంబర్ 150'.

ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని సక్సెస్ చేసిన అభిమానులకు థాంక్స్ - నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

సీమశాస్త్రి,సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాలు తర్వాత అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో

రానా మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్....

రానా,తాప్సీ,కె.కె.మీనన్ తారాగణంగా పివిపి సినిమా,మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో సంకల్ప్ దర్శకత్వంలో