నాగార్జున వెర్స‌స్ స‌మంత‌

  • IndiaGlitz, [Tuesday,May 22 2018]

అక్కినేని నాగార్జున, చెన్నై బ్యూటీ సమంత కలిసి ఇంత‌కుముందు ‘మనం’, ‘రాజుగారిగది2’ సినిమాల్లో పోటీ ప‌డి మరీ నటించారు. తొలిసారిగా.. ఇప్పడు వారి సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సినిమా ‘ఆఫీసర్’. దాదాపు 25 సంవత్సరాల తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో నాగ్ రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

ఈ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే తేదీకి తమిళ నటుడు విశాల్‌తో క‌లిసి సమంత నటించిన ‘అభిమన్యుడు’ (తమిళంలో విజ‌య‌వంత‌మైన ‘ఇరుంబుతిరై’కి అనువాద రూపం) చిత్రం విడుదల కానుంది. డెబ్యూ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ తెరకెక్కించిన ఈ మూవీలో డాక్టర్ రతీదేవిగా సమంత కనిపించనుంది. ఇంతవరకు నాగ్, సామ్ కలిసి నటించిన రెండు సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తొలిసారి పోటీ పడుతున్న వీరి సినిమాలు ఎటువంటి ఫలితాన్ని రాబ‌డ‌తాయో చూడాలి.

More News

సునీల్ సంద‌డంతా అప్పుడే..

‘నువ్వేకావాలి’ సినిమాతో హాస్య‌న‌టుడిగా ప‌రిచ‌య‌మైన‌ సునీల్‌.. అన‌తి కాలంలోనే టాప్ క‌మెడీయ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారిగా..

2001లో విడుద‌లైన‌ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

అక్క‌డ హ‌వా కొన‌సాగిస్తున్న మిక్కీ

క్లాస్‌ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. ఇప్పటివరకు ఈ స్వరకర్త కెరీర్‌ను పరిశీలిస్తే.. తన క్లాస్ అండ్ మెలోడీ మ్యూజిక్‌

మ‌హాన‌టి నిర్మాత‌ల‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న విజ‌య్‌..

‘అర్జున్ రెడ్డి’ విజయం తర్వాత చేతినిండా సినిమాలతో బిజీగా మారిన నటుడు యూత్ స్టార్ విజయ్ దేవరకొండ.

జూన్‌ 1న విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'.