బాలయ్య శాతకర్ణి గురించి నాగ్ ఇంట్రస్టింగ్ ట్వీట్..!
Wednesday, January 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించిన గౌతమీపుత్ర శాతకర్ణి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఇదిలా ఉంటే...గత కొన్ని రోజులుగా బాలకృష్ణ, నాగార్జున మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవానికి చిరంజీవి, వెంకటేష్ వచ్చారు కానీ నాగార్జున రాలేదు. అలాగే నాగార్జున ఫంక్షన్స్ కు బాలకృష్ణ రావడం లేదు. దీంతో అసలు వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం అంటూ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే...ఇటీవల బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...శాతకర్ణి పాత్ర చేయడానికి ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, ఎం.జి.ఆర్ లు స్పూర్తి అనడం విశేషం. అక్కినేని ఫ్యామిలీతో విభేదాలు వచ్చిన నేపధ్యంలో బాలకృష్ణ నోట అక్కినేని నాగేశ్వరరావు పేరు రావడం ఓ విశేషమైతే....గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ సందర్భంగా నాగార్జున బాలయ్య, క్రిష్ & టీమ్ కు ఆల్ ది బెస్ట్. నాకు చారిత్రాత్మక చిత్రాలంటే ఇష్టం. అందుచేత ఈ చారిత్రాత్మక చిత్రం చరిత్ర సృష్టించాలి అనుకుంటున్నాను అని ట్వీట్ చేయడం మరో విశేషం.
Wishing #Balayya,@DirKrish &team all the best for #GautamiPutraSatakarni/I love watching historicals. Let this one create history!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 11, 2017
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments