నాగ్ మరోసారి అదే ప్రయత్నం!!
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్‌డాగ్’లో ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తర్వాత చేయబోయే సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనపడబోతున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే.. గుంటూరు టాకీస్, పిఎస్వి గరుడవేగ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గరుడవేగ చిత్రంలో రాజశేఖర్‌ను ఎన్ఐఏ ఆఫీసర్‌గా చూపించిన ప్రవీణ్ సత్తారు, నాగార్జునను కూడా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చూపిస్తున్నాడని టాక్.
రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్, రా ఏజెంట్‌గా చేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించబోతున్నాడు. అంటే వరుస సినిమాల్లో నాగార్జున స్పెషల్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించబోతున్నారని సమాచారం. మరి ఈ రెండు ప్రయత్నాలు నాగార్జునకు ఏ మేరకు సక్సెస్‌లను అందిస్తాయో వేచి చూడాలి. సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వైల్డ్‌డాగ్ చివరి షెడ్యూల్ చిత్రీకరణ మిగిలి ఉంది. ఆ షెడ్యూల్ ముగియగానే ప్రవీణ్ సత్తారు సినిమాను నాగ్ స్టార్ట్ చేస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments