మలయాళ దర్శకుడితో నాగార్జున...

  • IndiaGlitz, [Monday,January 16 2017]

విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ప్రాముఖ్య‌త‌నిచ్చే హీరో అక్కినేని నాగార్జున త‌ర్వ‌లోనే నాలుగు భాష‌ల్లో రూపొంద‌నున్న ఓ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. శ్రీకుమార్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న రాన్‌డ‌మ్ ఓజ్జ‌మ్ అనే చిత్రంలో నాగార్జున న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. అమితాబ్ బ‌చ్చ‌న్‌, మోహ‌న్ లాల్‌, చియాన్ విక్ర‌మ్‌లు ఆయా భాషల్లో ఈ పాత్ర‌లోన‌టిస్తార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం నాగార్జున ఓం న‌మోవేంక‌టేశాయ ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల‌వుతుంది. అలాగే ఓంకాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రాజుగారి గ‌ది 2 సినిమాలో క్ఊడా నాగార్జున కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

More News

ఓవర్ సీస్ లో విశేషంగా ఆకట్టుకుంటున్న శతమానం భవతి..!

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శతమానం భవతి. ఈ చిత్రాన్ని వేగేశ్న సతీష్ తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

జనవరి 20న లారెన్స్ 'శివలింగ' ఆడియో విడుదల

కొరియోగ్రాపర్, డైరెక్టర్, హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై శివలింగ ను తెరకెక్కిస్తున్న చిత్రం 'శివలింగ'.రితిక హీరోయిన్గా నటిస్తుంది.

1 మిలియన్ మార్క్ ను అందుకుంటున్న శాతకర్ణి..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు.

2 మిలియన్ దిశగా ఖైదీ నెం 150..!

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత నటించిన ఖైదీ నెం 150 చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 47 కోట్ల 7 లక్షలు వసూలు చేసిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇడియట్, ఆర్య సూపర్ హిట్ అయినట్లే 'నేను లోకల్' సూపర్ హిట్ అవుతుంది - దిల్ రాజు

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.