మరోసారి డాన్‌గా..
Send us your feedback to audioarticles@vaarta.com
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'డాన్' చిత్రంలో డాన్‌గా నటించి అందర్నీ మెప్పించారు నాగార్జున. ఆ తర్వాత వచ్చిన 'భాయ్' చిత్రంలో కూడా నాగార్జున డాన్‌గా కనిపించారు. అయితే ఆ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు మూడోసారి నాగార్జున డాన్‌గా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నాగార్జున డాన్ గెటప్‌లో కనిపిస్తారని, నాని సైకియాట్రిస్ట్ పాత్ర చేస్తున్నారని సమాచారం. వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
త్వరలోనే ఈ మల్టీస్టారర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌లో నాగార్జున బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com