32 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు అక్కినేని నాగార్జున. 'గీతాంజలి' లాంటి లవ్ స్టోరీస్ గాని.. 'శివ' లాంటి యాక్షన్ మూవీస్ గాని.. 'హలో బ్రదర్' లాంటి కామెడీ ఎంటర్‌టైనర్స్ గాని.. 'మనం', 'ఊపిరి' లాంటి ప్రయోగాత్మక ఫీల్ గుడ్ చిత్రాలు గాని.. 'సంతోషం', 'నిన్నే పెళ్ళాడతా' లాంటి కుటుంబ కథా సినిమాలు గాని, 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' లాంటి భక్తిరస చిత్రాలు గాని.. ఇలా జోనర్ ఏదైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
అంతే కాకుండా.. రాంగోపాల్ వర్మ, దశరథ్, ఉప్పలపాటి నారాయణరావు, రాఘవ లారెన్స్, కల్యాణ్ కృష్ణ లాంటి దర్శకులను తన చిత్రాల ద్వారా పరిచయం చేశారు నాగ్. అలాంటి నాగార్జున కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'విక్రమ్'. హిందీలో విజయవంతమైన 'హీరో' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. శోభన హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీనియర్ దర్శకులు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా మే 23, 1986న విడుదలైంది. అంటే.. నేటితో నాగార్జున హీరోగా నటించిన తొలి సినిమా విడుదలై 32 ఏళ్ళు పూర్తవుతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout