Nagarjuna:రైతుబిడ్డ ప్రశాంత్ కారణంగా అరెస్ట్ కానున్న హీరో నాగార్జున?

  • IndiaGlitz, [Wednesday,December 20 2023]

బిగ్‌బాస్-7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రచ్చ రోజురోజుకు రచ్చ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొంతమంది ఆకతాయిలు బీభత్సం చేశారు. ఆ అల్లర్లలో ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదుచేశారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ అరెస్ట్ కోసం ప్రయత్నించగా.. అతను పరారీలో ఉన్నాడు. దీంతో ప్రశాంత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఫోన్ స్వీఛ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయిన రైతుబిడ్డ అని చెప్పుకునే సో కాల్డ్ పర్సన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవైపు ఈ తతంగంలో బిగ్‌బాస్ హోస్ట్ సీనియర్ హీరో నాగార్జునను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. బిగ్‌బాస్ షో పేరుతో వ్యక్తులను అక్రమంగా 100రోజులుగా నిర్బంధించడంపై విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది అరుణ్‌ పిటిషన్ వేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే షో ముగిసిన తర్వాత ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేయడానికి నాగార్జునను బాధ్యులు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వెనకున్న కుట్రను బయటకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వహించారని.. నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున సైతం చిక్కుల్లో పడ్డారు.

ఇదిలా జరుగుతుంటే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాడు ప్రశాంత్. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇంట్లోనే ఉన్నానని చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఏ తప్పు చేయకపోతే పోలీసులకు చిక్కకుండా ఎందుకు పరారీలో ఉన్నావని ప్రశ్నిస్తున్నారు. రైతుబిడ్డ ముసుగు వేసుకుని నువ్వు చేసిన రచ్చకు తమ హీరో నాగార్జున బలి కావాలా అని కింగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు రైతుబిడ్డ అని చెప్పుకుని తమ పరువు కూడా తీశాడని రైతులు కూడా విరుచుకుపడుతున్నారు. మొత్తానికి రైతుబిడ్డగా చెప్పుకుంటున్న ప్రశాంత్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

More News

Salaar: సలార్' ప్రమోషన్స్ షూరూ.. ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి..

దేశమంతా "సలార్' మేనియాతో ఊగిపోతుంది. ఎప్పుడెప్పుడు మూవీని వెండితెరపై చూద్దామని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Telangana:ఖర్చులకు కూడా డబ్బులు లేవు.. తెలంగాణ అప్పులు ఎన్ని లక్షల కోట్లంటే..?

రోజు వారీ ఖర్చులకి కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

AP Election :ఫిబ్రవరిలో ఏపీ ఎన్నికల షెడ్యూల్.. మార్చిలో పోలింగ్..?

ఏపీలో ఎన్నికల సమరానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో నిర్వహించేందుకు

CM YS Jagan:సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సీఎం వైయస్ జగన్ బర్త్‌డే ఫొటో

వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు అంటే పార్టీ శ్రేణులకు పెద్ద పండుగ లాంటిది. సంవత్సరంలోని

Mallikarjun Kharge:ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే..!

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  ఇండియా కూటమి(I.N.D.I.A Alliance) వేగంగా పావులు కదుపుతోంది.