తన బర్త్‌డే సందర్భంగా ఓ మహిళకు సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరు పదుల వయసులోనూ యువకుడిలా కనిపిస్తారు అక్కినేని నాగార్జున. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎవరిదైనా బర్త్ డే అయితే... సర్వ సాధారణంగా వారికే సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కానీ నాగ్ విషయంలో ఇది రివర్స్. ఆయనే తన వీరాభిమాని అయిన ఓ మహిళకు కాల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
నాగార్జునకు వీరాభిమాని అయిన లక్ష్మి అనే మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. విషయం తెలుసుకుని చలించిపోయిన నాగ్.. ఆమె కాల్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వడమే కాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ‘మీ ఫాదర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ సర్’ అని లక్ష్మి వెల్లడించింది. మీరు ఎలా ఉన్నారని నాగ్ ప్రశ్నించగా.. మీరు కాల్ చేశారు ఇక చనిపోయినా ఫర్వాలేదని లక్ష్మి చెప్పింది. తాను నాగ్ నుంచి కాల్ వచ్చిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని.. ఒళ్లంతా జలదరిస్తోందని లక్ష్మి వెల్లడించింది.
నాగ్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తొలుత తండ్రి వారసత్వంతో సినిమాల్లోకొచ్చినా.. ఆ ముద్రను తక్కువ సమయంలోనే చెరిపేసుకుని తనకంటూ నటుడిగా ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ‘శివ’ సినిమా ఆయన కెరీర్‌కి చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. యూఎస్‌ఏలో ఇంజినీరింగ్ చేసిన నాగార్జున.. సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమను తన కెరీర్ కోసం ఎంచుకున్నారు. సినిమాల్లో మంచి సక్సెస్‌ను సాధించిన నాగార్జున ఆ తరువాత వ్యాపారంపై కూడా దృష్టి సారించారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మేన్‌గా పేరు తెచ్చుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments