తన బర్త్‌డే సందర్భంగా ఓ మహిళకు సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగ్..

  • IndiaGlitz, [Saturday,August 29 2020]

ఆరు పదుల వయసులోనూ యువకుడిలా కనిపిస్తారు అక్కినేని నాగార్జున. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎవరిదైనా బర్త్ డే అయితే... సర్వ సాధారణంగా వారికే సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కానీ నాగ్ విషయంలో ఇది రివర్స్. ఆయనే తన వీరాభిమాని అయిన ఓ మహిళకు కాల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

నాగార్జునకు వీరాభిమాని అయిన లక్ష్మి అనే మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. విషయం తెలుసుకుని చలించిపోయిన నాగ్.. ఆమె కాల్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వడమే కాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. ‘మీ ఫాదర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ సర్’ అని లక్ష్మి వెల్లడించింది. మీరు ఎలా ఉన్నారని నాగ్ ప్రశ్నించగా.. మీరు కాల్ చేశారు ఇక చనిపోయినా ఫర్వాలేదని లక్ష్మి చెప్పింది. తాను నాగ్ నుంచి కాల్ వచ్చిన విషయాన్ని నమ్మలేకపోతున్నానని.. ఒళ్లంతా జలదరిస్తోందని లక్ష్మి వెల్లడించింది.

నాగ్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. తొలుత తండ్రి వారసత్వంతో సినిమాల్లోకొచ్చినా.. ఆ ముద్రను తక్కువ సమయంలోనే చెరిపేసుకుని తనకంటూ నటుడిగా ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ‘శివ’ సినిమా ఆయన కెరీర్‌కి చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. యూఎస్‌ఏలో ఇంజినీరింగ్ చేసిన నాగార్జున.. సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమను తన కెరీర్ కోసం ఎంచుకున్నారు. సినిమాల్లో మంచి సక్సెస్‌ను సాధించిన నాగార్జున ఆ తరువాత వ్యాపారంపై కూడా దృష్టి సారించారు. సక్సెస్‌ఫుల్ బిజినెస్ మేన్‌గా పేరు తెచ్చుకున్నారు.

More News

నెపోటిజం వల్ల నాకెలాంటి సమస్యా  ఎదురుకాలేదు:  నివేదా థామస్

సెలక్టివ్‌గా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ న‌టిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న హీరోయిన్స్ నివేదా థామ‌స్‌.

ఆ హీరోయిన్స్‌కి ర‌వితేజ హెల్ప్‌

ఒక‌ప్పుడు హీరోయిన్స్‌కు సినిమాల్లో మంచి లైఫ్ టైమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది హీరోయిన్స్ సినిమాల్లో పెద్ద‌గా కంటిన్యూ కావ‌డం లేదు.

రెండు భాగాలుగా ‘ఉప్పెన’ ..?

క‌రోనా టైమ్‌లో లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. లాక్‌డౌన్ స‌డ‌లింపులు వచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు థియేట‌ర్స్

తెలుగు నేర్చుకోవాలని మా తాతగారు పట్టుబట్టారు: అల్లు శిరీష్

అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది మన తెలుగు భాష. చిన్నారుల నవ్వులా స్వచ్ఛమైనది.. అమృతం కంటే తియ్యనైన తెలుగు భాషా దినోత్సవం నేడు. ఈ సందర్భంగా తెలుగు

అత్యాచార ఆరోపణలపై కృష్ణుడు ఏమన్నారంటే..

తనపై 139 మంది అత్యాచారం జరిపారంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.