ఆ సంస్థ పై నాగార్జున సీరియస్...
- IndiaGlitz, [Sunday,February 24 2019]
అక్కినేని నాగార్జున ఓ కార్పొరేట్ సంస్థపై సీరియస్ అయ్యాడు. అంతటితో అగకుండా సదరు సంస్థపై కేసు కూడా వేశాడు. ఇంతకు ఆ సంస్థ ఏదో కాదు.. యాక్ట్ ఫైబర్ నెట్.
ఇంతకు ఈ సంస్థకు.. నాగార్జునకు సంబంధం ఎమనుకుంటున్నారా? కొన్ని రోజుల క్రితం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సంస్థ ఓ లోగోను విడుదల చేసింది. ఆ లోగోలో ఎ అక్షరం.. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ స్టైల్లోనే ఉండటం.
దాంతో తన పర్మిషన్ లేకుండా తన సంస్థ స్టైల్‌ను కాపీ కొట్టడంతో నాగ్ సీరియస్ అయ్యి కేసు పెట్టాడు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. తీర్పు వచ్చే వరకు యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థ ప్రమోషన్స్‌లో విడుదల చేసిన లోగోను ఉపయోగించకూడదని జడ్జి ఆర్డర్ వేశారు.