ఏపీలో టికెట్ రేట్ల వివాదం: నాకేం ఇబ్బంది లేదు.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న ఏపీ టికెట్ల ఇష్యూపై టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రేట్లతో మీకు ఇబ్బంది కాదా? కమర్షియల్‌గా ఏపీలో ఉన్న టికెట్ రేట్లు వల్ల మీకు ఇబ్బంది లేదా? అని ఓ విలేకరి ప్రెస్మీట్లో అడగడంతో.. ‘నాకేం ఇబ్బంది లేదు.. టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే.. కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి.. నా సినిమాకి అయితే అలాంటి ఇబ్బంది లేదు’ అని తేల్చిచెప్పారు నాగార్జున.
కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతిశెట్టి నటించిన బంగార్రాజు విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. బంగార్రాజును సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నాగ్ పై విధంగా కామెంట్ చేశారు.
ఇక RRR, రాధేశ్యామ్ సినిమాలు వాయిదా పడటం చాలా బాధగా ఉంది అని నాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని... ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం చాలా ప్లాన్ చేసుకున్నారని నాగార్జున వెల్లడించారు. పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి.. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేయకతప్పలేదన్నారు. అలాగే రాధేశ్యామ్ సినిమా కూడా.. ఎంతో కష్టపడి ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారని నాగ్ అన్నారు. మరి ఆ రెండు సినిమాలు వాయిదా పడటంతో నాకు అడ్వాంటేజ్ వచ్చిందా లేదా? అన్నది బంగార్రాజు రిలీజ్ తరువాత చూద్దాం అని అన్నారు నాగార్జున.
మరోవైపు సినిమా టికెట్ల వివాదంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో మంత్రి పేర్ని నాని త్వరలో భేటీకానున్నారు. నానిని ఉద్దేశిస్తూ... 'పేర్ని నాని గారు నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యలకి సంబంధించిన వివరణ ఇస్తాను. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ కు పేర్ని నాని స్పందించారు. 'ధన్యవాదములు వర్మ గారు. తప్పకుండా త్వరలోనే కలుద్దాం' అని సమాధానమిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com