ప్రేమ దేనినైనా గెలుస్తుంది అని చెప్పే ఇన్ స్పైయిరింగ్ లవ్ స్టోరి నిర్మలా కాన్వెంట్ - నాగార్జున

  • IndiaGlitz, [Monday,September 05 2016]

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా, శ్రేయా శ‌ర్మ‌ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ నిర్మ‌లా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మిస్తుంది. జి.నాగ కోటేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కోటి త‌న‌యుడు రోష‌న్ సాలూరి సంగీతం అందిస్తున్న నిర్మ‌లా కాన్వెంట్ ఆడియోను ఈ నెల 8న‌, చిత్రాన్ని ఈనెల 16న రిలీజ్ చేయ‌నున్నారు.
ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో .....
నాగార్జున మాట్లాడుతూ.... ఫ్రెష్ ఫ్యూర్ ల‌వ్ స్టోరి వ‌చ్చి చాలా రోజులు అయ్యింది. ఈ క‌థ విన‌గానే కొత్త‌గా అనిపించింది. ఇది కేవ‌లం ప్రేమ క‌థ మాత్ర‌మే కాదు ఇన్ స్పైయిరింగ్ ల‌వ్ స్టోరి. ప్రేమ దేనినైనా గెలుస్తుంది అని చెప్పే సినిమా ఇది. మంచి క‌థ ఎప్పుడూ ఆర్టిస్ట్ ని వెతుక్కుంటూ వెళుతుంది. ఈ క‌థ విన‌గానే రోష‌న్ అయితే బాగుంటాడు అనిపించింది. అలాగే హీరోయిన్ శ్రేయా శ‌ర్మ కూడా. ఇద్ద‌రి జంట చాలా బాగుంది. ఫ‌స్ట్ ఫిల్మ్ అయినప్ప‌టికీ రోష‌న్ చాలా బాగా న‌టించాడు.
నాతో క‌లిసి శ్రీకాంత్ ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వార‌సుడు, నిన్నే ప్రేమిస్తా, శిరిడి సాయి చిత్రాల్లో న‌టించాడు. నాకు శ్రీకాంత్ అంటే ఇష్టం. ప్రెసిడెంట్ గారి పెళ్లాం సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఓరోజు శ్రీకాంత్ తో నువ్వు ఇంటికి వెళ్లిపో. విల‌న్ గా పిచ్చి పిచ్చి క్యారెక్ట‌ర్స్ చేయ‌కు. కాస్త టైమ్ తీసుకుని హీరోగా చెయ్ అని చెప్పాను. ఆత‌ర్వాత శ్రీకాంత్ స‌క్సెస్ ఫుల్ హీరో అయ్యాడు. ఇప్పుడు శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ తో నేను వ‌ర్క్ చేయ‌డం హ్యాఫీగా ఉంది. ఇక ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే...బిజినెస్ మేన్ గా న‌టించాను. ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయి క్యారెక్ట‌ర్ కాదు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చి సినిమా అయిపోయేంత వ‌రకు ఉంటాను. ఈ సినిమా ద్వారా చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 8న‌, సినిమాని ఈనెల 16న రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం అన్నారు.
నిర్మాత నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ మాట్లాడుతూ... నిర్మాత‌గా నా తొలి చిత్ర‌మిది. నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు చేస్తున్న‌ప్పుడు జి.కె ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. జి.కె అంటే క్రియేటివ్ ప్యాకేజ్. ప్ర‌తిది కొత్త‌గా ఆలోచిస్తుంటాడు. విభిన్నమైన ప్రేమ‌క‌థ ఇది. పాట‌లు బాగున్నాయి. అంద‌రికీ న‌చ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.... నా ఫ‌స్ట్ ఫిల్మ్ కి టెన్ష‌న్ ప‌డ్డానో లేదో తెలియ‌దు కానీ...ఈ సినిమాకి టెన్ష‌న్ ప‌డుతున్నాను. మా అబ్బాయి రోష‌న్ అనుకోకుండా రుద్ర‌మ‌దేవి సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఆత‌ర్వాత గ్యాప్ ఇచ్చి హీరోగా ప‌రిచ‌యం చేద్దాం అనుకున్నాను. ఓరోజు జి.కె వ‌చ్చి క‌థ చెప్పాడు. ఇది ఫ్యూర్ ల‌వ్ స్టోరి ఈ క‌థ నాకు ఎందుకు చెబుతున్నాడో అర్ధం కాలేదు. క‌థ పూర్త‌యిన త‌ర్వాత రోష‌న్ కోసం అని చెప్పాడు. నాగార్జున గారు, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పాడు. నాగార్జున గారి ప్రొడ‌క్ష‌న్ అంటే ఎలా ఉంటుందో ఎలాంటి సినిమాలు తీస్తారో తెలిసిందే. అయితే ఒక రోజు టైమ్ తీసుకుని మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో డిష్క‌స్ చేసి ఓకే చెప్పాను. రోష‌న్ కూడా చాలా ఇంట్ర‌స్ట్ చూపించాడు. ఏ ఆర్టిస్ట్ కైనా మంచి బ్యాన‌ర్ ద్వారా లాంఛ్ అయ్యే అవ‌కాశం రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా ఇది. రోష‌న్ ని ప‌రిచ‌యం చేస్తున్నందుకు నాగార్జున గార్కి, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ గార్కి, జి.కె గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

More News

ఈ నెల 16న వస్తోన్న 'అత్తారిల్లు'

అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అంజన్ కె.కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అత్తారిల్లు’.

రెండు పాటలు మినహా 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం' పూర్తి- విజయదశమి రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి,సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్ టైన్ చేశాయి.అత్తారింటికి దారేది,

చివరిషెడ్యూల్ లో నిఖిల్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అక్టోబర్ లో విడుదల

'స్వామిరారా','కార్తికేయ','సూర్య vs సూర్య'లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుసగా హ్యాట్రిక్ సూపర్ హిట్ చిత్రాలతో యూత్ లో

సెప్టెంబర్ 18న నిఖిల్ కుమార్ 'జాగ్వార్' ఆడియో

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,డిస్ట్రిబ్యూ టర్,ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ

నాని, విరించి వర్మ ల మజ్న ఆడియో విడుదల

నేచురల్ స్టార్ నాని,అను ఇమ్మాన్యుయల్,ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం మజ్ను.