'ఓం నమో వేంకటేశాయ' నా కెరీర్ లో ది బెస్ట్ చిత్రం అవుతుంది : కింగ్ నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై శిరిడిసాయి` నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ఓం నమో వేంకటేశాయ`. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేంకటేశ్వర స్వామి, హధీరామ్ బాబా మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్తో ఈ చిత్రం రూపొందింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫిబ్రవరి 8న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత ఎ. మహేష్‌రెడ్డి, సౌరభ్ జైన్, హీరోయిన్స్ విమలారామన్, అశ్విత, కథా రచయిత జె.కె. భారవి, పాట రచయితలు వేదవ్యాస్, అనంత శ్రీరాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె. విక్రం కుమార్, ఎడిటర్ గౌతంరాజు, కెమెరామెన్ ఎస్.గోపాల్‌రెడ్డి, కళా దర్శకుడు కిరణ్‌కుమార్ మన్నే పాల్గొన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ఈ సినిమాకి వర్క్చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు థాంక్స్. రిలీజ్ తర్వాత థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అంత హ్యాపీగా ఉన్నాను. మనం`, సోగ్గాడే చిన్నినాయనా`, ఊపిరి` మూడు సూపర్‌హిట్ సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం ఏంటి అని చాలా మంది అన్నారు. అసలు ఈ సినిమా ఒప్పుకుని చేయకపోతే ఇంకే సినిమా చేయాలి అని నేను అన్నాను. కమర్షియల్ సినిమా ఎప్పుడైనా చేయొచ్చు. ఆల్రెడీ 95 సినిమాలు చేశాను. ఓం నమో వేంకటేశాయ` సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమా వెరీ స్పిరిచ్యువల్, బ్యూటిఫుల్ జర్నీ. ఇలాంటి అవకాశం రావడం చాలా చాలా కష్టం. ఈ సినిమా చేసేటప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఎంతో డీప్కెళ్లి రచయితలు పాటలు రాశారు. తిరుమలలో జరిగిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. తిరుమలకి ఎందుకు వెళ్లాలి, అక్కడ ఏం చేయాలి, అసలు దేవుడు వున్నాడా? లేడా? అనే విషయాలు పక్కనపెడితే దేవుడ్ని పూజించి ఆయనకి చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేస్తే మనలో ఒక ఆత్మ స్థైర్యం వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు నాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవడం నా అదృష్టం. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా నాకు తెలీదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా..` పాటతో ఫస్ట్ షాట్ తీశారు రాఘవేంద్రరావు గారు. దేవుడికి స్వాగతం పలికే సీన్ అది. తర్వాత ఈ సినిమాకి ఎలాంటి హోం వర్క్ చేయలేదు. భారవిగారు రాసిన కథ, వేదవ్యాస్ గారు రాసిన సాహిత్యం, రాఘవేంద్రరావు గారు ఇచ్చిన గైడెన్స్‌తో ఈ సినిమా చేశాను. అన్నమయ్య`, శ్రీరామదాసు` భక్తుల సినిమాలు చేశాను. కానీ ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమా హాయిగా ఫినిష్ అయింది. నా కెరీర్లో ఈ సినిమా ది బెస్ట్ ఫిలిం అని గర్వంగా చెబుతున్నాను. సినిమా చూసే ప్రతి ఒక్కరి హార్ట్‌ని టచ్ చేస్తుంది. 7, 8 ఏళ్ల వయసులో ఒక మనిషి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆ మనిషి దేవుడ్ని చూడాలి అని గురువుగారిని అడగడం, దాని కోసం అతను ఎన్ని పనులు చేశాడు, ఎంత కష్టపడ్డాడు, చివరికి తిరుమలకి వెళ్లి దేవుడ్ని చూశాడా? లేదా అనేది చిత్రకథ. రాఘవేంద్ర రావు గారు చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆయన చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చాయి. ఇంత అద్భుతంగా ఎలా తీస్తున్నారు, అంత నాలెడ్జ్ ఆయనకి ఎలా వచ్చింది అని. చాలా మెచ్యూరిటీతో రాఘవేంద్రరావుగారు ఈ సినిమా తీశారు. ఇలాంటి సినిమాలు తీయడంలో ఆయన బాగా పండిపోయారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది. ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రోజులు ఆడుతుంది అనే టెన్షన్, భయం ఏమీ లేదు నాకు. ఫస్ట్ టైం నా లైఫ్‌లో టెన్షన్ లేకుండా ఉన్నాను. సినిమా చూశాను. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి సినిమా తీసిన రాఘవేంద్రరావు, మహేష్‌రెడ్డి, విక్రం, గోపాల్‌రెడ్డి ప్రతి ఒక్కరికీ నా థాంక్స్. ఈ సినిమాకి ఫస్ట్ నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ప్రెస్ వారంతా చక్కగా ఈ సినిమా గురించి రాస్తున్నారు. వారందరికీ నా థాంక్స్`` అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ప్రపంచంలో ఎన్ని పూలు ఉన్నాయో వాటన్నింటి గురించి వేదవ్యాస్ చక్కగా పాట రూపంలో రాశారు. ఫిబ్రవరి 10 నుండి ఓం నమో వేంకటేశాయ` ఆడే ధియేటర్లన్నీ తిరుమల దేవాయాలుగా మారిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వరల్డ్‌వైడ్‌గా ధియేటర్లు పుణ్యక్షేత్రాలుగా వెలగబోతున్నాయి. అనుష్క కృష్ణమ్మ పాత్రలో వెయ్యి నామాలవాడా మూడు నామాలవాడా` అనే పాటతో స్వామిని అనేకరకాలుగా సందర్శిస్తారు. హధీరాం బాబాగా నాగార్జున అద్భుతంగా నటించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా` పాటతో దేవుడి తలుపు తెరిచే సన్నివేశంలో నాగార్జున కళ్లలో వున్న పవర్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సౌరభ్‌జైన్ హిందీలో చాలా పాపులర్. అతను వేంకటేశ్వర స్వామిగా చేయడం సినిమాకి ఎంతో ప్లస్ అయింది. ఎంతో మంది భక్తులు వుండగా వేంకటేశ్వర స్వామి హధీరాం బాబాతోనే ఎందుకు పాచికలు ఆడాడు, అతనికే ఎందుకు కనబడ్డాడు? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా ఒక స్పిరిచ్యువల్ జర్నీగా సాగింది. ఈ సినిమా చూసి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలి`` అన్నారు.
నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమాతో నా జన్మ ధన్యం అయింది. ఈ సినిమా తీసే అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి, నాగార్జున గారికి థాంక్స్. ఒక ఫ్యామిలీలా షూటింగ్ చేశాం. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మొత్తం ఆ గోవిందుడే మమ్మల్ని నడిపించాడు. 500 సంవత్సరాల క్రితం తిరుపతి ఏవిధంగా ఉండేదో భారవిగారు అద్భుతంగా చెప్పారు. గోపాల్‌రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మూడు నెలలు కష్టపడి లొకేషన్స్‌ని ఫైనల్ చేశారు. తమిళనాడు, కర్నాటక, మాల్దీవులు, మహాబలేశ్వరంలో షూటింగ్ చేశాం. రాఘవేంద్రరావుగారు ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జీతో పనిచేశారు. ఇదే డేట్‌కి రిలీజ్ చేయాలని పూజ రోజే అనుకున్నాం. నాగార్జున భక్తిభావంతో ఈ సినిమా చేశారు. సెట్లో ఆయన కళ్లు చూసి చాలా బాగున్నాయి ఆయన ఎలా ఇంప్రెస్ చేస్తారో అని అనుకునే వాళ్లం. ఆయనకి ఒకరోజు దిష్టి కూడా తగిలింది. కళ్లు ఎర్రగా అయిపోయాయి. ఆ ప్రాబ్లం కూడా ఆ గోవిందుడే తీర్చాడు. సినిమా స్టార్టింగ్ నుండి అయిపోయే దాకా నాగార్జునగారు గెడ్డం తీయలేదు. సినిమా అయిపోయింది గడ్డం తీయవచ్చు కదా అంటే లేదు. సినిమా చూసి ఇంకా ఏమైనా మార్పులు చేయాలి అంటే చేసి అప్పుడు గెడ్డం తీస్తాను అన్నారు. చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుకి, అక్కినేని ఫ్యాన్స్‌కి ఈ సినిమా పెద్ద గిఫ్ట్‌గా ఇస్తున్నారు నాగార్జునగారు. మనం`, సోగ్గాడే చిన్నినాయనా`, ఊపిరి` వంటి మూడు సూపర్‌హిట్స్ ఇచ్చిన తర్వాత కూడా నాగార్జున ఈ సినిమా చేయడం మా అదృష్టం. నాగేశ్వరరావు గారు ఉండి ఉంటే అన్నమయ్య` అప్పుడు ఎంత సంతోషపడ్డారో ఈ సినిమా చూసి ఇంకా వంద రెట్లు సంతోషపడే వారు ఆయన. ఈ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సీన్ బిగినింగ్ నుండి లాస్ట్ వరకు వేంకటేశ్వర స్వామిని చూస్తూనే ఉంటాం. సౌరభ్ జైన్ చాలా అందంగా అద్భుతంగా చేశాడు. హధీరాం బాబా, వేంకటేశ్వర స్వామి ఆడే ఆట చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ సినిమాలో హధీరాం బాబా బాలాజీ అని వేంకటేశ్వర స్వామికి పేరుపెట్టారు. ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఈ సినిమా తీపిగుర్తుగా మిగిలిపోతుంది. కీరవాణి అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఈ చిత్రంలో పాటలు 45 నిమిషాలపాటు ఉంటాయి. ఒకదాన్ని మించి ఒకటి పాటలు ఉంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా` వన్నాఫ్ ది బెస్ట్ సాంగ్. నా ఫేవరెట్ సాంగ్ అది. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్, శ్రీదేవి అందరూ బ్యూటిఫుల్‌గా నటించారు. మా టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేశారు. ఒక భక్తిభావంతో ఈ సినిమా చేశాం. మాకు సపోర్ట్చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు`` అన్నారు.
నటుడు సౌరభ్‌జైన్ మాట్లాడుతూ ` ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు, నాగార్జున, గోపాల్‌రెడ్డి గారికి నా థాంక్స్. తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం రాకుండా డైరెక్టర్‌గారు, మా టీమ్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఒక పిక్నిక్లా షూటింగ్ జరిగింది. ఈ సినిమా అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది`` అన్నారు.
కథా రచయిత జె.కె. భారవి మాట్లాడుతూ ` పది సంవత్సరాలుగా ఈ కథపై ఎన్నో రీసెర్చ్‌లు చేశాను. రాఘవేంద్రరావు, నాగార్జున మహేష్‌రెడ్డి గార్లు ఈ కథని ఓకే చేశాక వన్ ఇయర్పాటు ఒక యజ్ఞంలా భక్తి శ్రద్ధలతో ఈ సినిమా షూటింగ్ చేశాం. పాటలో కథ జరుగుతుంది. అందరూ కష్టపడి ఈ సినిమాకి వర్క్‌చేశారు. ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం`` అన్నారు.
పాటల రచయిత వేదవ్యాస్ మాట్లాడుతూ ` ఈ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి థాంక్స్. అందరి హృదయాలను దోచుకోవడానికి ఈ సినిమా వస్తోంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments