'మన్మథుడు-2' ట్రైలర్ రివ్యూ ‘అద్భుతం.. అమోఘం’ అంటున్న నాగ్..!!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు’. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్‌లు, ట్రైలర్స్, టీజర్లు సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేశాయి. కాగా.. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 9న అభిమానుల ముందుకు రానుంది. తాజాగా.. థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
డైలాగ్స్ అదుర్స్..!
ఈ ట్రైలర్లో కొంత వినోదభరితంగానూ, మరికొంత ఉద్వేగభరితంగాను సాగిందని చెప్పుకోవచ్చు. ‘అద్భుతం.. అమోఘం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. హమ్మీ గో..’ అంటూ కారులో వెన్నెల కిషోర్ పక్కన కూర్చొని మంచి జోష్‌తో నాగార్జున చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ‘మీరెప్పుడూ ప్రేమలో పడలేదా?’ అని రకుల్ అడిగితే.. ‘ఒకపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’ అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు నాగ్. ‘ఏ అమ్మాయ్.. బాగానే వున్నావ్ గదా .. వీడ్ని చేసుకుంటున్నావేంటి?’ అనే రావు రమేశ్ డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.‘నువ్వు ఒంటరిగా ఉండటమే కరెక్ట్ .. నీతో ఎలాగో ఎవరూ ఉండలేరు’ అనే రకుల్ డైలాగ్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
వయసు మీదికొస్తున్నప్పటికీ!!
దాదాపుగా విదేశాల్లోనే చిత్రీకరించినట్లు ప్లేస్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తమ్మీద నాగ్‌ను అందరూ కార్నర్ చేసి ‘పెళ్లి.. పెళ్లి’ అంటూ గోల చేస్తూ బాగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ పక్కనపెడితే.. 50 పైబడిన వయసులోనూ నాగ్ రొమాన్స్ ఆడియన్స్‌ను పిచ్చెక్కించడం ఖాయమని చెప్పొచ్చు. విదేశీ భామలతో ఆయన లిప్‌లాకులు కూడా చేసేసి మన్మథుడు అనిపించుకున్నారు!
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ట్రైలర్‌ను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments