ఆయ‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ రావాలి - నాగ్

  • IndiaGlitz, [Friday,September 16 2016]

కింగ్ నాగార్జున నేష‌న‌ల్ అవార్డ్ రావాలి అని కోరుకుంటుంది ఎవ‌రికి అనుకుంటున్నారా...? విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కి. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌కాష్ రాజ్ తాజాగా మ‌న ఊరి రామాయ‌ణం చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ ఆడియో వేడుక‌లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ... ప్రతి మనిషిలో రాముడు, రావణాసురుడు ఉంటారు. ఎన్టీఆర్‌గారు చేసిన రావణాసురుడు రోల్‌ చూశాను. పుస్తకాల్లో చదివాను. అందుకే రావణాసురుడు అంటే నాకు కూడా ఇష్టమే.

ప్రకాష్‌ రాజ్‌ జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేస్తాడు. తనలా ఉండటానికి నేనెంతో ప్రయత్నించాను. ఏ పని చేసినా ప్రకాష్‌ ఎంజాయ్‌ చేస్తాడు. ప్రకాష్‌ రాజ్‌ దర్శకత్వంలో మనవూరి రామాయణం రూపొందడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలు కొత్త టర్న్‌ తీసుకుంటున్నాయి. మంచి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నాయి. ఇలాంటి టర్నింగ్‌ మూమెంట్‌లో మనవూరి రామాయణం విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రకాష్‌ రాజ్‌గారికి దర్శకుడిగా కూడా నేషనల్‌ అవార్డ్‌ రావాలని కోరుకుంటున్నాను అన్నారు. మ‌రి...నాగ్ కోరుకున్న‌ట్టుగా ప్ర‌కాష్ రాజ్ కి ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డ్ వ‌స్తుందేమో చూద్దాం..!

More News

కింగ్ నాగార్జున చేతుల మీదుగా మ‌న ఊరి రామాయ‌ణం ఆడియో విడుద‌ల‌

జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన‌ ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.

వైజాగ్ లో ఈనెల 17న డా.మంచు మోహ‌న్ బాబు 40 న‌ట వ‌సంతాల వేడుక‌కు భారీ ఏర్పాట్లు

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు. నటజీవితంలో నలభై వసంతాలను పూర్తి చేసుకుని ఈతరం నటులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

హైపర్‌ ఫస్ట్‌ సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్ (ప్ర‌తి ఇంట్లో ఒక‌డుంటాడు).

ఈనెల‌ 22న ధనుష్‌ రైల్‌ విడుదల

రఘువరన్‌ బి.టెక్‌, అనేకుడు, మాస్‌, మరియన్‌ వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన త‌మిళ హీరో ధనుష్‌ కథానాయకుడిగా, నేను శైలజ వంటి సూపర్‌హిట్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్‌ కథానాయికగా రూపొందిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'రైల్‌'.

రోష‌న్ నెక్ట్స్ మూవీ ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..రూపొందిన యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ నిర్మ‌లా కాన్వెంట్. ఈ చిత్రాన్ని జి.నాగ‌కోటేశ్వ‌ర‌రావు తెర‌కెక్కించారు. ఈరోజు రిలీజైన నిర్మలా కాన్వెంట్ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌స్తుంది.