చైతు లవ్ గురించి స్పందించిన నాగ్..
Wednesday, June 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య - సమంత...ప్రేమించుకుంటున్నారు...త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు గత కొన్ని రోజులుగా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో వినిపిస్తున్న విషయం తెలిసిందే. సమంత టాలీవుడ్ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నాను అని చెప్పింది కానీ..హీరో ఎవరనేది చెప్పలేదు. చైతన్య అది కూడా చెప్పలేదు. కానీ...చైతు - సామ్ లవ్ లో ఉన్న విషయం బయటపడింది. అయితే...నాగ్ ఫ్యామిలీ చైతు లవ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? ఇవ్వదా..? అనేది సస్పెన్స్ గా ఉండేది.
ఇప్పుడు ఈ సస్పెన్స్ కి నాగ్ తెర దించేసారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో నాగ్ చైతు లవ్ గురించి మాట్లాడుతూ...చైతు ఓ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. నేను, అమల చైతు లవ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని చెప్పకనే చెప్పేసారు. త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నట్టు తెలియచేసారు. చైతు ప్రేమమ్ రిలీజ్ అయిన తర్వాత లవ్ గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments