తీసుకున్న లోన్స్ అన్నింటిని క్లియర్ చేసాం ఇది నిజం - నాగార్జున
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పేరు మీద బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అయితే... గతంలో నాగ్ తీసుకున్న లోన్స్ క్లియర్ చేయలేదు... అన్నపూర్ణ స్టూడియోస్ కు నోటీసులు ఇచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే....భారత ప్రధాని మోడీ 500, 1000 నోట్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ మోడీని నాగార్జున ట్విట్టర్ ద్వారా అభినందించారు.
ఈ టైమ్ లో కొంత మంది మోడీని అభినందిస్తున్నారు బాగానే ఉంది...ముందు మీరు కరెక్ట్ గా లోన్స్ కట్టండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేసారట. ఈ విషయం నాగార్జునకు తెలిసిందో ఏమో....ఈరోజు ట్విట్టర్ లో నాగ్ స్పందిస్తూ....అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలకు కొత్త సౌకర్యాలు అందించేందుకు గాను బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం అనేది ఎంత నిజమో...తీసుకున్న లోన్స్ అన్నింటిని ఈ సంవత్సరం బిగినింగ్ లోనే క్లియర్ చేసేసాం అనేది కూడా అంతే నిజం. అన్నపూర్ణ స్టూడియోస్ ఏ బ్యాంక్ కు బాకీ లేదు అంటూ క్లారిటి ఇచ్చారు. అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com