తీసుకున్న లోన్స్ అన్నింటిని క్లియ‌ర్ చేసాం ఇది నిజం - నాగార్జున‌

  • IndiaGlitz, [Thursday,November 17 2016]

అక్కినేని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్ పేరు మీద బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అయితే... గ‌తంలో నాగ్ తీసుకున్న లోన్స్ క్లియ‌ర్ చేయ‌లేదు... అన్న‌పూర్ణ స్టూడియోస్ కు నోటీసులు ఇచ్చారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే....భార‌త ప్ర‌ధాని మోడీ 500, 1000 నోట్ల ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. 500, 1000 నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తూ మోడీని నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు.

ఈ టైమ్ లో కొంత మంది మోడీని అభినందిస్తున్నారు బాగానే ఉంది...ముందు మీరు క‌రెక్ట్ గా లోన్స్ క‌ట్టండి అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ చేసార‌ట‌. ఈ విష‌యం నాగార్జున‌కు తెలిసిందో ఏమో....ఈరోజు ట్విట్ట‌ర్ లో నాగ్ స్పందిస్తూ....అన్న‌పూర్ణ స్టూడియోస్ లో సినిమాల‌కు కొత్త సౌక‌ర్యాలు అందించేందుకు గాను బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం అనేది ఎంత నిజ‌మో...తీసుకున్న లోన్స్ అన్నింటిని ఈ సంవ‌త్స‌రం బిగినింగ్ లోనే క్లియ‌ర్ చేసేసాం అనేది కూడా అంతే నిజం. అన్న‌పూర్ణ స్టూడియోస్ ఏ బ్యాంక్ కు బాకీ లేదు అంటూ క్లారిటి ఇచ్చారు. అది సంగ‌తి..!

More News

నితిన్ మూవీలో కొత్త హీరోయిన్..!

యువ హీరో నితిన్ - అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ కోసం శృతిహాస‌న్ ను సంప్ర‌దించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

గాలి పెళ్లిలో డ్యాన్స్ కి ర‌కుల్ అంత తీసుకుందా..!

గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమార్తె బ్రాహ్మ‌ణి పెళ్లిని క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో చేసారు. ఈ పెళ్లికి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. దాదాపు 500 కోట్ల రూపాయ‌ల‌తో ఈ పెళ్లి జ‌రిగిందట‌.

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ పూర్తి..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శ్రియ న‌టిస్తుంది. హేమ‌మాలిని బాల‌కృష్ణ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

శ్రీదేవి కూతురు జాహ్నవి నటిస్తున్న సినిమా ఇదే..!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి సినీ రంగ ప్రవేశం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ప‌వ‌న్ మూవీలో న‌టిస్తున్న‌ నాని హీరోయిన్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవ‌ల ఈ చిత్రాన్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే.