పోరాట యోధుడు, వీరుడు, శూరుడిని కాపాడిన నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ కాస్త వెటకారంగా అనిపిస్తున్నా ఇది మాత్రం నిజమే. హోస్ట్ నాగార్జున ప్రైవేట్ జెట్‌లో వచ్చి మరీ అమ్మ రాజశేఖర్‌ని కాపాడారు. నిజానికి ఇప్పటి నుంచి కాదు.. కొన్ని వారాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక పోరాట యోధుడు, వీరుడు, శూరుడు ఏంటా? అనుకుంటున్నారా? ఒక్కసారి ఆయన్ను నామినేట్ చేస్తే.. ఆయనలోని మాటల బాణాలను అలవోకగా సంధించే పోరాట యోధుడు బయటకు వస్తాడు. ఎవరైనా ఆయనతో ఆర్గ్యుమెంట్‌కి దిగితే అంతే అలవోకగా కేరెక్టర్‌పై దాడి చేసే వీరుడు, శూరుడు బయటకు వస్తాడు. టాస్కుల్లో ఏమాత్రం ప్రభావం చూపలేని ఆయన ఆటతీరు బిగ్‌బాస్‌కి తప్ప వేరెవరికీ నచ్చదు. నామినేషన్స్ నుంచి బయటపడటం కోసం అమ్మ అరగుండు కొట్టించుకున్నప్పుడు ఆయనలో నాగ్‌కి పదవులను త్యజించిన మహాత్ముడు కనిపించగా.. ఆయనను నామినేట్ చేసిన వాళ్లు.. అమ్మకు ఓట్లు వేయని ప్రేక్షకులు గాడ్సేలుగా మిగిలిపోయారు.
మొదటి నుంచి అలా సేఫ్ అవుతూ...
హీరో-జీరో టాస్క్‌లో దేవి, లాస్య ఆయనను జీరోను చేసినప్పుడు ఆయన ప్రదర్శించిన ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీంతో రెండు, మూడు వారాల పాటు ఆయన్ను నామినేట్ చేయడానికే కంటెస్టెంట్లు భయపడి పోయారు. ఆ తరువాత నామినేషన్ నుంచి విముక్తి కల్పించడం కోసం అరగుండు కాన్సెప్ట్ తీసుకువచ్చారు. పోనీ అదేమైనా వారమంతా ఉందా? అంటే అదీ లేదు. శనివారమే ఆదివారానికి సంబంధించిన షూట్ కూడా జరిగిపోతుంది. శనివారం షో ముగిసే సమయంలో ఈ కాన్సెప్ట్ తీసుకువచ్చారు. మహా అయితే ఓ పావుగంట పాటు అరగుండుతో ఉండి ఉంటారు అంతే. తన స్వార్థం కోసం అమ్మ రాజశేఖర్ అరగుండు చేయించుకుంటే త్యాగశీలివంటూ ఓ రేంజ్లో పొగిడి నాగ్ చిటారు కొమ్మన కూర్చోబెట్టారు. ఇన్నాళ్లకు ఎలాగో నామినేషన్స్‌లోకి వచ్చారు. ఇక అమ్మ పని గోవిందా అనుకున్నారంతా.. కానీ ఓట్లేసిన వారి పని గోవిందా అయిపోయింది. ఎలిమినేట్ చేయకున్నా ప్రేక్షకులు పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదేమో కానీ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్‌ని చేయడంతో ప్రేక్షకులు సైతం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బిగ్‌బాస్ 4 విన్నర్ అమ్మ రాజశేఖర్ అంటూ తంబ్ నెయిల్స్‌తో యూ ట్యూబ్ నిండిపోయింది.
సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు?
ఈసారి ప్రేక్షకుల ఓట్లకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వట్లేదు బిగ్‌బాస్ అనే ఆరోపణలు దారుణంగా వినిపిస్తున్నాయి. దేవి విషయంలోనూ అలాగే జరిగిందనే చర్చ జరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం ఆమెకు జర్నలిస్టుగా ఉన్న నెగిటివిటీయే యాంటీగా పని చేసి ఉండొచ్చని సరిపెట్టుకున్నారు. కానీ కుమార్ సాయి విషయాన్ని మాత్రం ప్రేక్షకులు అలా లైట్ తీసుకోలేకపోయారు. మా ఓట్లకు ప్రాధాన్యం లేకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. ప్రతి వారమూ ఇలాగే ఎలిమినేషన్స్ విషయంలో ప్రేక్షకుల భావాలకు ప్రాధాన్యమివ్వకుండా బిగ్‌బాస్ టీం ట్విస్ట్ ఇస్తూనే ఉంది. ఈ ప్రభావం షోపై దారుణంగా పడింది. రేటింగ్ దారుణంగా పడిపోయింది. అయినా కూడా బిగ్‌బాస్ టీం ధోరణిలో మార్పు రాలేదు. ఇప్పుడు మరోసారి అమ్మ రాజశేఖర్‌ను ఎలిమినేషన్ నుంచి తప్పించారు. డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్‌ని చేశారు. అంతే కాదు.. కెప్టెన్సీ కట్టబెట్టి మరో రెండు వారాలు.. ఆ తరువాత మరింకేదో చెప్పి చివరకు టాప్ 5లో కూర్చోబెట్టినా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. బిగ్‌బాస్ టీం ఇలా చేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోందో తెలియడం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com