నాగ్ , వర్మ చిత్రం టైటిల్ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ సినిమాకి సంబంధించి ఏ ఒక్క విషయం బయటికి వచ్చినా.. అది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ టైటిల్ ను, విడుదల తేదీని ఆదివారం ప్రకటించబోతున్నట్టు వర్మ తెలిపారు. అయితే వర్మ అభిమాన నటి శ్రీదేవి ఆకస్మిక మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసారు.
ఇదిలా వుంటే.. ఇప్పుడు ఈ చిత్రం టైటిల్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి చక్కర్లు కొడుతోంది. నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆఫీసర్` అనే టైటిల్‌ను ఖాయం చేసారని సమాచారం. దీంతో పాటు గన్`, సిస్టమ్` పేర్లు పరిశీలనలోకి వచ్చాయని.. ఆఫీసర్` టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించిందని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు వర్మ. ఈ చిత్రంతో మైరా సరీన్ కథానాయికగా పరిచయం అవుతున్న విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments