నాగార్జున - ఆర్జీవి సినిమా షూటింగ్ ముహూర్తం ఖరారు

  • IndiaGlitz, [Wednesday,November 01 2017]

తెలుగు సినిమా కాన్వాస్ పై రాంగోపాల్ వర్మ-నాగార్జునల "శివ" సినిమా ఒక చెరగని సంతకం చేసింది. "శివ" విడుదలై 28 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ సినిమా కొత్త దర్శకులకు ఒక నిఘంటువు వంటిది. అలాంటి క్రేజీ కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత రిపీటవ్వానుంది. రాంగోపాల్ వర్మ ఓ అద్భుతమైన కథ చెప్పాడని, త్వరలోనే సెట్స్ కు వెళ్లనుందని నాగార్జున స్వయంగా ఇటీవల "రాజుగారి గది 2" ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయం తెలిసిందే.

రాంగోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. "శివ" సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. రాంగోపాల్ వర్మ "కంపెనీ" బ్యానర్ లో ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఆర్జీవి చిరకాల మిత్రుడు సుధీర్ చంద్ర పడిరి ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ లో చిత్రీకరణ పూర్తి చేసుకొనున్న ఈ అమేజింగ్ మూవీ రిలీజ్ డేట్, టైటిల్ మరియు ఇతర క్యాస్ట్ & క్రూ డీటెయిల్స్ త్వరలోనే రాంగోపాల్ వర్మ వెల్లడిస్తారు!

More News

మూడోసారి కూడా అలాగే..

కింగ్ నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. గ‌తేడాది సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం.. కలెక్ష‌న్ల విష‌యంలో నాగ్ కెరీర్‌లోనే పెద్ద హిట్ గా నిలిచింది.

సంక్రాంతికి రానున్న ర‌వితేజ‌?

బెంగాల్ టైగ‌ర్ త‌రువాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని.. ఇటీవ‌లే రాజా ది గ్రేట్‌తో ప‌ల‌క‌రించాడు ర‌వితేజ‌. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. ఈ సినిమాకి మంచి వ‌సూళ్లే ద‌క్కాయి.

విజయ్ దేవరకొండతో పవన్ డైరెక్టర్ ?

పెళ్లిచూపులుతో సోలో హీరోగా తొలి హిట్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఏడాది ఆగస్టులో రిలీజైన అర్జున్ రెడ్డితోనే పరిశ్రమ దృష్టిలో పడ్డాడు ఈ యువ కథానాయకుడు.

ప‌వ‌న్ హీరోయిన్‌.. ఒకే రోజు రెండు చిత్రాలు

మ‌జ్ను (2016) చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన కేర‌ళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్‌. ఆ త‌రువాత కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌తో ప‌ల‌క‌రించిన ఈ చిన్న‌ది.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా అత‌ని 25వ చిత్రంలో న‌టిస్తోంది.

'క్వీన్' నుంచి తప్పుకుంది

బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన చిత్రం క్వీన్. 2014లో విడుదలైన ఈ సినిమాలో కంగనారనౌత్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఇప్పుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.