నాగ్ , వర్మ.. తొలిసారిగా
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు తెరపై సంచలనం సృష్టించిన కాంబినేషన్లలో కథానాయకుడు నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంబినేషన్ ఒకటి. ఇప్పటివరకు వీరి కాంబోలో నాలుగు సినిమాలు (అందులో ఒకటి హిందీ చిత్రం 'షివ') విడుదలయ్యాయి. ప్రస్తుతం ఐదో సినిమా రెడీ అవుతోంది. ఆ చిత్రమే 'ఆఫీసర్'. అయితే.. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ టైం విషయంలో.. గత నాలుగు చిత్రాలకి భిన్నంగా వెళుతున్నారు.
కాస్త వివరాల్లోకి వెళితే..
వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం శివ` అక్టోబర్(1989)లో విడుదల కాగా.. ఇక హిందీలో ఇదే పేరుతో పునఃనిర్మాణం చేసిన చిత్రం 1990, డిసెంబర్లో విడుదలైంది. అలాగే.. 1992 సెప్టెంబర్ నెలలో అంతం`, 1994 జనవరి నెలలో గోవిందా గోవిందా` చిత్రాలు విడుదలయ్యాయి. అయితే.. ఇప్పుడు మొదటిసారిగా వేసవిని టార్గెట్ చేస్తూ వీరి కలయికలో రాబోతున్న ఐదో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మే 25న 'ఆఫీసర్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మొదటిసారిగా వేసవిని టార్గెట్ చేసుకుని వస్తున్న ఈ ఇద్దరి కాంబినేషన్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments