ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
శివ` వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున, దర్శకుడు రాంగోపాల్ వర్మ. నాగార్జున కెరీర్ శివ`కి ముందు, శివ`కి తర్వాత అన్నట్టుగా మార్చిన ట్రెండ్ సెట్టర్ ఫిలిం ఇది. ఆ తర్వాత వీరి కలయికలో అంతం`, గోవిందా గోవింద` వంటి సినిమాలు వచ్చినా.. ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి. కట్ చేస్తే.. దాదాపు 24 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న నాల్గవ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇటీవలే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ముంబయ్‌లో జరుగనుంది. అక్కడ దాదాపు పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారమ్. కాగా, ఈ మూవీ టైటిల్స్‌కి సంబంధించి.. ఇప్పటికే రెండు పేర్లను ఫిలిం ఛాంబర్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు సమాచారం. అందులో మొదటిది గన్` కాగా రెండవది సిస్టం`. త్వరలోనే టైటిల్‌పై క్లారిటీ వస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నాగ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. నాగ్ సరసన మైరా సరీన్ కథానాయికగా నటిస్తోంది
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments